ఆర్టీసీ కండక్టర్ను వరించిన సర్పంచి పదవి
సూర్యనాయక్ తండా సర్పంచి గా లూనావత్ కృష్ణ నాయక్
On
ఆర్టీసీ కండక్టర్ను వరించిన సర్పంచి పదవి
సూర్యాపేట, పెన్ పవర్ డిసెంబర్ 12:
జాజిరెడ్డిగూడెం మండలం సూర్యా నాయక్ తండా సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి లూనావత్ కృష్ణ తన ప్రత్యర్థి లూనావత్ వెంకన్నపై 180 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కృష్ణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తన పై నమ్మకం ఉంచి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేసిన నాయకులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి పాటు పడతానని హామీ ఇచ్చారు.

Tags:
