కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం..!

సర్కిల్-25 రెవెన్యూ విభాగంలో ప్రమాద ఘటన..

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం..!

ZomboDroid_13112025192200

అగ్నికి ఆహుతైన కీలక ఫైళ్లు.. ప్రమాద సమయంలో విధుల్లో 8 మంది సిబ్బంది..

సకాలంలో స్పందించిన జీడిమెట్ల పోలీసులు.. సిబ్బంది సురక్షితం..

కుత్బుల్లాపూర్, పెన్ పవర్, నవంబర్ 13:

మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ జీహెచ్ఎంసి సర్కిల్-25 కార్యాలయం లోని రెవెన్యూ విభాగంలో, గురువారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. కార్యాలయం లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని. క్షణాల్లోనే ఫైళ్లు, ఫర్నీచర్‌ మంటల్లో దగ్ధమవ్వడంతో దట్టమై పొగలు కమ్ముకున్నాయి.. అదే సమయంలో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ కారణంగా కొంతమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే సహాయక సిబ్బంది మరియు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటల్లో చిక్కుకున్న 8మంది జీహెచ్ఎంసి ఉద్యోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.. ఫైర్‌ సిబ్బంది సమాచారం అందుకొని ఫైరింజిన్‌లతో ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు.. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.. మరోవైపు జీహెచ్ఎంసిలో రెవెన్యూ విభాగం‌ ముఖ్యమైనది అయినందున అగ్నిప్రమాదంపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి..

 

Tags:

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts