కరాటే లో అంతర్జాతీయంగా బంగారు పథకాలు సాధించిన చిన్నారులు

కరాటే లో అంతర్జాతీయంగా బంగారు పథకాలు సాధించిన చిన్నారులు

కరాటే లో అంతర్జాతీయంగా బంగారు పథకాలు సాధించిన చిన్నారులు

హైదరాబాద్ పెన్ పవర్ జనవరి 30:

విశాఖపట్నం నందు కరాటే ఇండియా ఆర్గనైజేషన్ లో భాగమైన యునైటెడ్ షోటోఖాన్ కరాటే డూ ఇండియా మరియు మహిర షోటోఖాన్ కరాటే డూ ఇండియా వారి సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం నందు నిర్వహించిన 9వ ఆల్ స్టైల్స్ ఇన్విటేషనల్ కరాటే చాంపియన్షిప్ 2026 నందు 4 దేశాల మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇట్టి పోటీలలో నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన పాతనబోయిన సుదీక్ష  కటాస్ విభాగంలో బంగారు పతకం మరియు కుమితే విభాగంలో రజత పతకాలు మరియు పాతనబోయిన విహాస్ దుర్గ అండర్ కటాస్ మరియు కుమితే విభాగంలో 2 బంగారు పతకాలు సాధించారు. చిన్నప్పటి నుండి ఇరువురు క్రీడలలో చురుగ్గా రాణిస్తూ పాల్గొన్న ప్రతి అంతర్జాతీయ పోటీలలో బంగారు పథకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావడం గర్వకారణం అని పలువురు కొనియాడారు .

IMG-20260130-WA0040

Tags:

About The Author

Related Posts