రాజేష్ కస్టడీ మృతి కేసులో డీజీపీ, కలెక్టర్, ఎస్పీకి NHRC నోటీసులు
తెలంగాణ, సూర్యాపేట జిల్లా కు చెందిన రాజేష్ కస్టడీ మృతి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలకంగా స్పందించింది.
రాజేష్ కస్టడీ మృతి కేసులో డీజీపీ, కలెక్టర్, ఎస్పీకి NHRC నోటీసులు
హైదరాబాద్ పెన్ పవర్ జనవరి 23:
తెలంగాణ, సూర్యాపేట జిల్లా కు చెందిన రాజేష్ కస్టడీ మృతి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలకంగా స్పందించింది. ఈ ఘటనపై ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యాయశాస్త్ర విద్యార్థి సభావట్.కళ్యాణ్ చేసిన ఫిర్యాదు మేరకు NHRC ఈ కేసును స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), సూర్యాపేట జిల్లా కలెక్టర్ మరియు సూర్యాపేట ఎస్పీలకు ఎనిమిది వారాల్లో పూర్తి చర్యల నివేదిక (Action Taken Report – ATR) సమర్పించాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. కస్టడీలో రాజేష్ మరణానికి దారి తీసిన పరిస్థితులు, చట్టపరమైన నిబంధనల అమలు, మానవ హక్కుల పరిరక్షణ చర్యలపై సమగ్ర వివరాలు నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది.
కస్టడీ మరణాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా మారుతున్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మౌలిక మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకత, బాధ్యత, చట్టపాలనను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.


