జీవో 252 ను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా

టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందజేత

జీవో 252 ను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా

జీవో 252 ను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా

 టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందజేత

అక్రిడిటేషన్ కార్డులను తగ్గిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

 టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్

రంగారెడ్డి పెన్ పవర్ డిసెంబర్ 27:

 తెలంగాణ ప్రభుత్వం సమాచార శాఖ ఇటీవల విడుదల చేసిన జీవో 252 ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు గుర్తింపు కార్డు అయిన అక్రిడిటేషన్ కార్డ్ లు భారీ సంఖ్యలు తగ్గే ప్రమాదం ఉందని, వెంటనే జీవో 252 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై జీవో 252 కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టను నినాదాలు చేశారు. ధర్నా అనంతరం మీడియాతో టియుడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 23 వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయగా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ కార్డులు జారీ చేయకపోగా ఉన్న కార్డులను కోత విధించే విధంగా జీవో 252 విడుదల చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వాములైన జర్నలిస్టులకు నేడు అవమానం ఎదురవడం దురదృష్టకరమని అన్నారు. లక్ష జనాభా కు ఒక కార్డు చొప్పున హైదరాబాద్ అర్బన్ ఏరియాలో ఉన్న అతిపెద్ద నియోజకవర్గాలలో కేవలం ఒకే కార్డుతో జర్నలిస్టులు ఏ విధంగా న్యాయం పొందుతారో మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన అల్లం నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విధివిధానాలను రూపొందించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగే విధంగా 23 వేల అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయించారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం 100 కోట్ల బడ్జెట్ను అసెంబ్లీ లో ప్రకటింప చేసి 42 కోట్ల రూపాయల నిధులను మీడియా అకాడమీ అకౌంట్లో జమ చేసిన చరిత్ర అల్లం నారాయణ గారిదని అన్నారు. హెల్త్ కార్డులు ఇండ్ల స్థలాలు సాధించిన చరిత్ర అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న టి యు డబ్ల్యూ జే నాయకత్వాన్నిదని స్పష్టం చేశారు. రెండు సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకు రాకపోగా ఉన్న అక్రిడేషన్ లను కూడా కోత పెట్టి విధంగా జీవో తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు యూనియన్ నాయకులమని చెప్పుకొని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి తన పదవికి రాజీనామా చేసి జర్నలిస్టుల పక్షాన పోరాటానికి కలిసి రావాలని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల హక్కులను కాలరాయాలని చూస్తే ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా పోరాటం చేయడానికి టీయూడబ్ల్యూజే సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యదర్శి పైల్ల విట్టల్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ జర్నలిస్టులు అవమానానికి లోను కావలసిన దుస్థితి నేడు దాపురించిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పోరాటం చేసిన తమలాంటి జర్నలిస్టులు కూడా ఈరోజు అక్కుల సాధన కోసం అని రోడ్లపై బైఠాయించి పరిస్థితి రావడం దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతటి ఉద్యమాలకైనా వెనుకాడేది లేదని విటల్ రెడ్డి తేల్చి చెప్పారు. ధర్నా అనంతరం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి శ్రీనివాస్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం రమేష్, కోశాధికారి వెంకటేష్, రాష్ట్ర నాయకులు చందర్, జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, పల్లె వెంకన్న, ఈర్ల చంద్రం, యూనియన్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు సూరమొని సత్యనారాయణ, శేర్లింగంపల్లి నియోజక వర్గం అధ్యక్షులు ఉప్పరి రమేష్ సాగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గం అధ్యక్షులు కృష్ణ, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు చిత్రం సైదులు, షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts