చెరువుల అనుసంధానానికి అడ్డంకులు..!
గొలుసుకట్టు కాలువలు- సర్‌ప్లస్ నాలాలు కబ్జా..!
అంతరించి పోతున్న గొలుసుకట్టు కాలువలు..! సర్‌ప్లస్ నాలాలు..!
ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న ఈ అంశపై..! అప్రమత్తం కాకపోతే అంతే సంగతులు..!
తప్పుడు 'ఎన్‌వోసి'ల జారీతో, కుంచించుకు పోతున్న చెరువులు, నాలాలు..
కట్టుకాలువలు-సర్‌ప్లస్ నాలాల స్వభావం వేరైనా..! రెండూ సహజ నీటి ప్రవాహాలే..
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం..! తాజాగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్‌లు జీహెచ్ఎంసిలో విలీనం ప్రక్రియతో, ప్రస్తుతం 300 డివిజన్‌లుగా విస్తరించారు సంతోషం.. ఈ ప్రక్రియతో జీహెచ్ఎంసి పరిధిలో మరికొన్ని చెరువులు కుంటల సంఖ్య పెరుగుతోంది.. మరోవైపు పెరుగుతున్న జనాభాతో పాటు, రియల్ ఎస్టేట్ భూములకు రెక్కలు వచ్చాయి.. దీనికితోడు ప్రభుత్వ భూముల కబ్జాలకు కూడా హద్దూ అదుపు లేకుండా పోతోంది తెలిసిందే.. రాబోయే కాలంలో ఏ ప్రభుత్వాల హయాంలో ఎన్ని చెరువులు కనుమరుగు అవుతాయో కూడా చెప్పలేం..!ఓవైపు ఇప్పటికే చెరువులు, కుంటలు, కుంచించుకు పోవడం..! నిబంధనలు ఉల్లంఘించి గొలుసుకట్టు కాలువలకు అడ్డంకులతో, ఒక చెరువు నీరు మరో చెరువులోకి వెళ్ళే అనుసంధాన మార్గాలు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురవుతున్నాయి.. రెండు గంటలపాటు వర్షం కురిస్తే, హైదరాబాద్ మహానగరం వణికి పోతుంది.. అందరికి తెలిసిన ఈ విషయం నగర ప్రజలను కొంత ఆందోళనకు గురిచేస్తుంది.. శివారు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లుగా ఆవిర్భావించి..! ప్రస్తుతం జీహెచ్ఎంసిలో విలీనమై మహా నగరాభివృద్ధి దిశగా పయనిస్తుంది అనుకునేలోపే..! వరద విపత్తులు ఆలోచన, భయాందోళన కలిగిస్తుంది.. నీటిపారుదల- రెవెన్యూ శాఖల వైఫల్యంతో కబ్జాలకు గురవుతున్నాయి.. చెరువులు, సర్‌ప్లస్ నాలాలు, కట్టుకాలువల, ఆక్రమణలతో, నిబంధనలు ఉల్లంఘించి భూగర్భంలో పైప్‌లైన్ ప్రక్రియ భవిష్యత్తును మరింత ప్రమాదకరగా మారుస్తుంది.. ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఏదైనా..! సంబంధిత అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.. ప్రస్తుతం బహుదూర్‌పల్లి, సూరారం, గాజులరామారం గ్రామాల పరిధిలోని చెరువులు, గొలుసుకట్టు కాలువల కబ్జాలలో అధికారుల నిర్లక్ష్యంపై "పెన్ పవర్" ప్రత్యేక కథనం..పెన్
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, డిసెంబర్ 18:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని "దుండిగల్ గండిమైసమ్మ- కుత్బుల్లాపూర్" మండలాల నడుమ చెరువులు, కుంటలు, గొలుసుకట్టు కాలువల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.. మేడ్చల్ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు..! "నార్త్ ట్యాంక్ డివిజన్" బుద్ద భవన్ సికింద్రాబాద్ ఇరిగేషన్ అధికారుల పనితీరు, ప్రజలకు ప్రమాదాలు తలపెట్టే విధంగా మారాయి.. భవిష్యత్తు వరద విపత్తులకు దారితీసే విధంగా ఉన్నాయి.. ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.. ఫిర్యాదు చేస్తే జవాబుదారీ తనం కనిపించదు.. ఇకపోతే అధికారుల విధుల్లో పారదర్శకత మచ్చుకు కూడా ఉండదు.. ఈ రెండు ఇరిగేషన్ విభాగాలు, పలుకుబడి ఉన్నోళ్ళ సిఫార్సులు, ముడుపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు.. నిబంధనలు ఉల్లంఘించి, వాల్టా చట్టాలను కాలరాస్తున్నారు.. సుమారు 9-10 చెరువులు, కుంటలకు, సర్‌ప్లస్ నీటి ప్రవాహాలు, గొలుసుకట్టు కాలువల అనుసంధాన ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి.. ఈ రెండు సహజసిద్ధమైన నీటి ప్రవాహాలను భూ గర్భంలో పైప్‌లైన్ ద్వారా పంపించడం..! పూర్వం నుండి ఉన్న నాలాలు, వారి నిర్మాణాలకు అనుకూలంగా, దారి మళ్ళించి, కుంచించుకు పోవడం.. పట్టాభూముల నెపంతో నాలా బఫర్ జోన్‌ల ఆక్రమణ, వ్యవహారం అంతా అధికారుల కనుసన్నల్లోనే అంటూ సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
#పెన్ పవర్ దినపత్రికలో రేపటి సంచికలో పూర్తి వార్తా కథనం..#
About The Author
మాధవ్ పత్తి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
