నేను రిటైర్ అవ్వను.. 2029లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీచేస్తా

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం

నేను రిటైర్ అవ్వను.. 2029లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీచేస్తా

జగ్గంపేట, పెన్ పవర్, జనవరి 21: నేను రాజకీయాలకు రిటైర్మెంట్ ఇస్తానని చాలా మంది అనుకుంటున్నారని అయితే ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల గతంలో తాను తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నానని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. బుధవారం జగ్గంపేటలో జరిగిన నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల తాను మళ్లీ 2029 శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానన్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల నవీన్ పోటీలో ఉంటారని తాను కాకినాడ జిల్లాలోని ఏదొక నియోజకవరం నుంచి పోటీ చేసి గెలిచితీరుతానని నెహ్రూ స్పష్టం చేశారు. నిజంగా రిటైర్ అవుదామనుకున్నా కానీ కొంతమందికి బుద్దిచెప్పడానికి మళ్లీ బరిలో నిలుస్తానన్నారు. కొంతమంది రాజకీయాలు అంటే ఆటలు అనుకుంటున్నారని రాజకీయం అంటే ఆటలు కాదని ఇంట్లో కూర్చుని చప్పట్లు కొట్టించుకుని బాజాలు కొట్టించుకుంటే రాజకీయం అవ్వదని వాళ్లకి బుద్ధిచెప్పాలంటే నేను బరిలో ఉండాల్సిందేనని రాష్ట్ర ప్రజల్లో ఆ నమ్మకం తాను కలిగించుకున్నాని ఎమ్మెల్యే నెహ్రూ పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యే నెహ్రూ 2029లో పోటీలో ఉండరని అనుకున్న కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టి తమ అభిమానాన్ని చూపించారు.

Tags:

About The Author

Related Posts