G ANIL KUMAR
కాకినాడ / Kakinada 

గణపతి మండపాల వద్ద పోలీసు డ్రోన్ కెమెరాలతో నిఘా 

గణపతి మండపాల వద్ద పోలీసు డ్రోన్ కెమెరాలతో నిఘా  జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 27: జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో గణపతి మండపాల వద్ద పోలీసు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినట్లు జగ్గంపేట సీఐ వై ఆర్ కే శ్రీనివాస్ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం జగ్గంపేటలో పలు గణపతి మండపాలను ఆయన సందర్శించి దర్శనం చేసుకున్నారు. ఆయా మండపాల వద్ద చుట్టుపక్కల ప్రాంతాలను డ్రోన్ కెమెరాతో పరిశీలించారు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో మూడు మండలాల్లో 493 గణపతి మండపాలకు అనుమతులు ఇచ్చామన్నారు. గణపతి మండపాల వద్ద కమిటీ సభ్యులు భద్రతా చర్యలు తీసుకోవాలని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. అలాగే గణపతి నిమజ్జనాలు చేసే పలు ప్రాంతాలను పరిశీలించినట్లు సీఐ వై ఆర్ కే తెలిపారు.   
Read...
కాకినాడ / Kakinada 

డీఎస్సీలో 19వ ర్యాంకు సాధించిన రామవరం వాసి 

డీఎస్సీలో 19వ ర్యాంకు సాధించిన రామవరం వాసి  జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 27: డీఎస్సీ ఫలితాల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వీరంరెడ్డి సుజిని రాష్ట్రంలో 19వ ర్యాంకు సాధించారు. ఈమె ఎంఏ బీఈడీ పూర్తి చేసి డీఎస్సీకి ప్రిపేర్ అయ్యి విజయం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమెను టిడిపి తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడబాల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జనసేన నాయకులు మొగిలి గంగాధర్, మండపాక పాపారావు, సూర్యనారాయణ, సుబ్రహ్మణ్యం, మరుకుర్తి గంగాధర్, నీలం నాగులు మాగంటి నాని తదితరులు అభినందనలు తెలిపారు. 
Read...

గెద్దపేట గణనాధుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే నెహ్రూ

గెద్దపేట గణనాధుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే నెహ్రూ జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 27: వినాయక చవితి సందర్బంగా గణేష్ ఉత్సవాల్లో భాగంగా జగ్గంపేట మండల గ్రామాల్లో వాడవాడల గణనాధుడి విగ్రహాలు నెలకొల్పారు. శుక్రవారం ఆయా గణనాధులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో పలు గణనాధులను దర్శించుకున్నారు. దీనిలో భాగంగా జగ్గంపేట గెద్దపేట గణనాధుడిని ఎమ్మెల్యే నెహ్రూ దర్శించుకుని పూజలు చేసి ప్రసాదం స్వీకరించారు. ముందుగా గెద్దపేట టైగర్స్ ఎమ్మెల్యే నెహ్రూకి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, కొండ్రోతు శ్రీను, కొండ్రోతు బుజ్జి, సాంబత్తుల చంద్రశేఖర్, బద్ది సురేష్, హరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Read...

జగ్గంపేటలో బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా వేడుకలు

జగ్గంపేటలో బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా వేడుకలు జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 12 : ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం జగ్గంపేటలో బిజెపి కాకినాడ జిల్లా కార్యదర్శి, జగ్గంపేట ఇంచార్జ్ దాట్ల కృష్ణ వర్మ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వై ఆర్ కే శ్రీనివాస్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గంపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. బిజెపి ఇన్చార్జి కృష్ణ వర్మ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలంతా దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, బిజెపి మండల అధ్యక్షుడు పల్లా రాము, కోన సురేష్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Read...

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్ జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 1: జగ్గంపేట నియోజకవర్గంలోని వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కాకినాడ లో డిఆర్ఓ జే వెంకట్రావుకు జగ్గంపేట వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. వైసిపి నాయకులు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పిలుపుమేరకు జగ్గంపేట వైసీపీ ఇన్చార్జ్ తోట నరసింహం ఆదేశాలతో గత నాలుగు రోజులపాటు విస్తృతంగా నిర్వహించిన సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వుయ్యూరి నాని, నకిరెడ్డి సుధాకర్, మండపాక రవికుమార్, వైసీపీ జగ్గంపేట అధ్యక్షుడు రావుల గణేష్ రాజా, కాపవరపు ప్రసాద్, కుండ్ల జాన్ వెస్లీ ఉన్నారు. 
Read...

ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు

ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 1: ఈనెల మూడవ తేదీన జగ్గంపేట ప్రభుత్వ హైస్కూల్లో జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు జరగనున్నట్లు జూడో జిమ్ అండ్ కరాటే మాస్టర్ టీవీవి రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011, 2012, 2013 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ పోటీకి అర్హులు అన్నారు. పోటీలకు హాజరయ్యే అభ్యర్థులు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రావాలన్నారు. వెయిట్ కేటగిరీ  అబ్బాయిలు : -30-35-40-45-50-55-60-66+66 అమ్మాయిలు  -28-32-36-40-44-48-52-57+57. పోటీలో మొదటి స్థానం సాధించిన వాళ్లు గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవుతారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 9, 10వ తేదీల్లో జరుగుతాయన్నారు. 
Read...

సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన

సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 1: జగ్గంపేట ఆర్టీసీ బస్టాండ్ లో జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట ఎస్సై టి.రఘునాథరావు సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై విద్యార్థులు, ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వీడియోల రూపంలో సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ ధారణ పై ఆవశ్యకత, వివిధ క్రైమ్ అంశాలపై వివరించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై రఘునాథరావు సూచించారు. 
Read...

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి కోరారు. జగ్గంపేటకు చెందిన బోధ శివ భద్రరావు పరివర్తన చెంది తన మతం వీడి సనాతన ధర్మంలో నడవడానికి కుటుంబంతో సమేతంగా హిందుత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి వారితో ముందుగా సోమాలమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆయన కార్యాలయం వద్ద వారిని సత్కరించి మానవ జీవితాలను మార్చగలిగే శక్తివంతమైన భగవద్గీత పుస్తకం వారికి ఇచ్చారు. సనాతన ధర్మం కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో బద్ది సురేష్, రెడ్డి సాయి, ప్రసాద్, ముచ్చుపల్లి వీర్రాజు, సాయికుమార్, స్వామి పాల్గొన్నారు. 
Read...
కాకినాడ / Kakinada 

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు  జగ్గంపేట, పెన్ పవర్, జూలై 27: జగ్గంపేట కాపు కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సొసైటీ చైర్మన్ పదవీ స్వీకారోత్సవ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గంపేట నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారని జ్యోతుల నెహ్రూను కొందరు ప్రశ్నిస్తున్నారని వారికి ఇదే నా సమాధానమన్నారు. 2004లో ఏవిధంగా రాజకీయ స్ట్రాటజీ ఉపయోగించారో దాన్ని వాళ్లు ఇప్పుడు ఉపయోగిస్తున్నారన్నారు. అప్పుడు తోట నరసింహంకు టికెట్ ఇచ్చినప్పుడు వెంకటాచలం మాదిరి కనిపించడానికి మీసం గీయించేశారని అది జగ్గంపేట ప్రజలను మోసం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు. సూర్యనారాయణమ్మ అనే మహిళ బాధ్యత తీసుకుంటానని చెప్పి మాట తప్పారన్నారు. వీరవరం సొసైటీకి పోటీ వద్దని తోట వెంకటాచలం కోరితే అక్కడి నుంచి నెహ్రూ పోటీకి ఎవరినీ దింపలేదని అది అప్పుడు ఉన్న నాయకులకు మాత్రమే తెలుసునన్నారు. శత్రు వుకు అన్యాయం చేయని వ్యక్తి జ్యోతుల నెహ్రూ అని అది జగమెరిగిన సత్యమన్నారు. ఏరోజు తాను నోరు విప్పలేదని వారు మాట్లాడిన తీరుకు ఇప్పుడు సమాధానం చెబుతున్నానని అవి వాస్తవాలు కాదా అని నవీన్ ప్రశ్నించారు.
Read...
కాకినాడ / Kakinada 

పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 

పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల  జగ్గంపేట, పెన్జ పవర్, జూలై 25: కాకినాడ జిల్లా జగ్గంపేట  మండలం రామవరం గ్రామంలో పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుండి ఏలేరుకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, పిఠాపురం జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరై మోటార్ స్విచ్ ఆన్ చేసి, గోదావరి జలాలకు పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగినదని రైతాంగానికి సాగునీరు అందించడానికి ఎప్పుడూ ముందుంటామన్నారు. 
Read...
కాకినాడ / Kakinada 

జూలై నెలాఖరుకి తాళ్ళూరు లిఫ్ట్ నుంచి నీరు పారుతుంది

జూలై నెలాఖరుకి తాళ్ళూరు లిఫ్ట్ నుంచి నీరు పారుతుంది జగ్గంపేట, పెన్ పవర్, ఏప్రిల్ 4: గండేపల్లి మండలం తాళ్ళూరు లిఫ్ట్ నుంచి జూలై నెలాఖరుకి ఖచ్చితంగా నీరు పారుతుందని పంటలు వేసుకునేందుకు రైతులంతా సిద్ధంగా ఉండాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం గండేపల్లి మండలం మురారిలో ఎమ్మెల్యే నెహ్రూ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గత సీజన్ లో నీరు పంటలకు అందే పరిస్థితి లేక పంటలు వేసుకోవద్దని తేల్చి చెప్పాననన్నారు. అయితే దీనిపై సీఎం చంద్రబాబుతో 15సార్లుకు పైగా మాట్లాడి ఇరిగేషన్ మంత్రితో చర్చలు జరిపానన్నారు. ఇటీవల ఏవరో సోషల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే నెహ్రూ వల్లే తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని వైసీపీ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉండేదని విమర్శలు చేస్తున్నారని అసలు తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ కి సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటో తెలుసా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించలేదని మాట్లాడుతున్నారని అసలు బడ్జెట్ ఎలా ప్రవేశ పెడతారో కూడా తెలియని వాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. తాళ్ళూరు లిఫ్ట్ పై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నామని ఏదేమైనప్పటికీ జూలై నెలాఖరుకి నీరు పారుతుందని ఎమ్మెల్యే నెహ్రూ స్పష్టం చేశారు.
Read...
కాకినాడ / Kakinada 

ఎన్నో అవమానాలు తట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ 

ఎన్నో అవమానాలు తట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్   జగ్గంపేట, పెన్ పవర్, మార్చి 8: ఎన్నో అవమానాలు తట్టుకుని, ఆయనకున్న సినిమా అవకాశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారు పరిణయ ఫంక్షన్ హాల్ లో శనివారం రాత్రి జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కౌడా చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 11 సంవత్సరాలు పార్టీని తన భుజాన మోసారన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే ఈ ఆవిర్భావ సభను ప్రతీ ఒక కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. పెద్ద ఎత్తున సభకు హాజరై గర్వపడేలా సభ నిర్వహిద్దామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు భారీగా హాజరయ్యారు. 
Read...

About The Author