ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
By G ANIL KUMAR
On
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి కోరారు. జగ్గంపేటకు చెందిన బోధ శివ భద్రరావు పరివర్తన చెంది తన మతం వీడి సనాతన ధర్మంలో నడవడానికి కుటుంబంతో సమేతంగా హిందుత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి వారితో ముందుగా సోమాలమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆయన కార్యాలయం వద్ద వారిని సత్కరించి మానవ జీవితాలను మార్చగలిగే శక్తివంతమైన భగవద్గీత పుస్తకం వారికి ఇచ్చారు. సనాతన ధర్మం కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో బద్ది సురేష్, రెడ్డి సాయి, ప్రసాద్, ముచ్చుపల్లి వీర్రాజు, సాయికుమార్, స్వామి పాల్గొన్నారు.
Tags: