అటవీ కబ్జాపై.. "ఎన్‌జిటి" కీలక ఆదేశాలు..
గాజులరామారం సర్వే నెం.19 ఫారెస్ట్ భూమిలో "ఆర్‌డిడి" సర్వేపై అసంతృప్తి..
గాజులరామారం అటవీశాఖ భూభాగం కబ్జా వివాదంపై "ఎన్‌జిటి సౌత్ జోన్" చెన్నై కీలక ఆదేశాలు జారీచేసింది.. సర్వే నెం.19 మొత్తానికి మరోసారి సరిహద్దులు నిర్ధారించాలని, చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్, "తెలంగాణ సర్వే విభాగం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది..1957–58 పహాణి, గ్రామ నక్షా ప్రకారం సర్వే నెం.19 మొత్తం ఎకరాలు 471–14 గుంటలు అటవీ భూమి ఉండగా..! సర్వే టీమ్ ఇటీవల ఇచ్చిన నివేదికలో ఎకరాలు 430–00 గుంటలు మాత్రమే చూపించడంపై ఎన్‌జిటి అసంతృప్తి వ్యక్తం చేసింది.. దీంతో "ఒరిజినల్ అప్లికేషన్ నెంబర్ 17ఆప్ 2022 కేసులో సుమోటో కింద ఆర్‌డిడిని పార్టీని చేసిన ఎన్‌జిటి పలు అంశాలను సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, నవంబర్ 19:
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గజులరామారం గ్రామ శివారు సర్వే నెం.19 అటవి భూభాగం కబ్జా వివాదంపై ఎన్‌జిటి సంచలన ఆరోపణలు చేసింది.. లోప భూయిష్టమైన సర్వేగా, అక్రమ, ఆక్రమణలపై "నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్‌జోన్" కీలక ఆదేశాలు జారీ చేసింది.. అటవీశాఖ నివేదిక ప్రకారం "1957–58 పహాణి, గ్రామ నక్షా" ప్రకారం సర్వే నెం.19 మొత్తం 471–14 ఎకరాలు అటవీభూమి ఉన్నట్లు ఫారెస్ట్ నివేదికలో ఉంది.. అయితే సర్వే టీమ్ (ఆర్‌డిడి) ఇటీవల సమర్పించిన నివేదికలో 430–00 ఎకరాలు మాత్రమే చూపించడం, ఫారెస్ట్ భూమి తగ్గడంపై ఎన్‌జిటి అసంతృప్తి వ్యక్తం చేసింది.. 146 మీటర్ల వెడల్పు, 900 మీటర్ల పొడవు ఉన్న ముఖ్య ప్రదేశాన్ని సర్వే టీమ్ ఉద్దేశపూర్వకంగానే వదిలేసినట్టు ఫారెస్ట్ శాఖ నివేదికలో ప్రస్తావించినట్టు ఎన్‌జిటి గుర్తు చేసింది.. "ట్రై జంక్షన్ నుండి బై జంక్షన్" వరకు 678 మీటర్లు మాత్రమే (ఆర్‌డిడి) చూపిస్తున్నారని. నిజానికి 900 మీటర్‌లు ఉండాల్సిందిగా పేర్కొంటూ, సంబంధిత తప్పుడు నివేదికను అటవీశాఖ ఆమోదించలేదు.. ఈ నేపథ్యంలోనే ఎన్‌జిటి జారీచేసిన కీలక ఆదేశాలతో ఇప్పుడు సమీకరణాలు మారబోతున్నట్టు స్పష్టమవుతుంది.. దీంతో "అటు అటవీశాఖ-ఇటు ఆర్‌డీడి" సర్వే విభాగం కూడా విడివిడిగా సర్వేలు నిర్వహించాలని ఎన్‌జిటి ఆదేశించడం, ఇద్దరూ కూడా సర్వే నివేదికలు, వేరువేరుగా కౌంటర్ ఫైల్ చేయాలని "ఎన్‌జిటి ఆర్డర్"లో స్పష్టంగా పేర్కొంది.. ఫారెస్ట్ భూమిని ఎవరు, ఎక్కడ, ఎంత భూమిని కబ్జాచేశారో వివరాలతో పాటు, కబ్జాదారుల వివరాలు, ఎంత కబ్జా చేశారనే వివరాలను స్పష్టమైన ఆధారాలతో నివేదిక సమర్పించాలని "నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్" కీలక ఆదేశాలు జారీ చేసింది.. 2025 డిసెంబర్ 11 వరకు సంబంధిత నివేదిక సమర్పించాలని ఎన్‌జిటి ఆదేశించింది..
*#ఎన్‌జిటి తాజా ఆదేశాల పూర్తి వార్తా కథనాన్ని రేపటి "పెన్ పవర్" దినపత్రికలో చదవండి..#*
About The Author
మాధవ్ పత్తి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
