జర్రెల రోడ్డు అభివృద్ధి అత్యవసరం: నాలుగు పంచాయతీల 30 వేల మందికి జీవనరేఖ

గిరి జనజాగృతి సమన్వయసమితి అధ్యక్షులు ముర్ల వెంకట రమణ

IMG_20260120_102256

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జనవరి 20:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన గూడెం కొత్తవీధి మండలం జర్రెల ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నాలుగు పంచాయతీలకు చెందిన సుమారు 30 వేల మంది ప్రజల జీవనాధారమైన “జర్రెల రోడ్డు” దయనీయ స్థితిలో ఉండటంతో నిత్య ప్రయాణం ప్రమాదకరంగా మారింది.చింతపల్లి నుంచి మొండిగడ్డ వరకు సుమారు 15 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ రోడ్డు ఘాటీ మలుపులు, దెబ్బతిన్న ఉపరితలంతో ప్రమాదాలకు కేంద్రంగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, ముఖ్యంగా అత్యవసర వైద్య సేవల కోసం ప్రయాణించే రోగులు ఈ మార్గంలో తీవ్ర కష్టాలు పడుతున్నారు. అంబులెన్స్‌లు సైతం ఈ రోడ్డుపై సకాలంలో చేరలేని పరిస్థితి నెలకొంది.ఈ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం దక్కలేదు. ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు వినిపిస్తున్నాయని, అనంతరం ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ జర్రెల రోడ్డు అభివృద్ధి మాత్రం నిర్లక్ష్యానికి గురవుతోందని విమర్శిస్తున్నారు.గిరి జనజాగృతి సమన్వయ సమితి అధ్యక్షుడు ముర్ల వెంకటరమణ మాట్లాడుతూ,“జర్రెల రోడ్డు అభివృద్ధి విలాసం కాదు – మా హక్కు. ఈ రోడ్డు లేకుండా ఈ ప్రాంతానికి భవిష్యత్తే లేదు.

నాయకత్వానికి గౌరవం పదవితో కాదు, ప్రజలకు చేసిన సేవతో వస్తుంది” అని పేర్కొన్నారు.

నాలుగు పంచాయతీల ప్రజల తరఫున జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీలు తక్షణమే స్పందించి జర్రెల రోడ్డు అభివృద్ధికి, ముఖ్యంగా ప్రమాదకర ఘాటీ మలుపుల సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ఆయన వినమ్రంగా కోరారు.“జర్రెల రోడ్డు – మా జీవనరేఖ” “రోడ్డు ఉంటేనే అభివృద్ధి” “మా ప్రాణాలకు విలువ ఇవ్వండి” అని నినదిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement