ఆర్‌వీ నగర్ నెతన్య చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

దైవ సేవకులకు ఘన సన్మానం

ఆర్‌వీ నగర్ నెతన్య చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,డిసెంబర్ 25:అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్తవీధి మండలం, ఆర్‌వీ నగర్‌లోని యూసిఎం నెతన్య చర్చి వద్ద క్రిస్మస్ వేడుకలు శోభాయమానంగా నిర్వహించారు. ఈ వేడుకలను దైవజనులు రెవరెండ్ వి. పద్మాకర్ రావు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జరిపారు.ఈ సందర్భంగా ఏసుక్రీస్తు జననం, ఆయన బోధించిన ప్రేమ, శాంతి, క్షమాగుణాలపై క్రిస్మస్ సందేశాన్ని దైవజనులు విశదీకరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా దైవ సేవకులు రెవరెండ్ వి. పద్మాకర్ రావు దంపతులకు, దైవ సేవకులు జోసెఫ్ దంపతులకు,పాస్టర్లు హనోకు, ఎసన్నా లను పాత్రికేయుడు మాదిరి చంటిబాబు, ఉపాధ్యాయుడు లొంజ ప్రకాష్, వైసీపీ నాయకుడు లొంజ గణపతి దంపతులు దుశాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.క్రిస్మస్ వేడుకల అనంతరం సంఘ సభ్యులు, గ్రామస్తులందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో స్నేహసౌహార్ద్రాలను పెంపొందించాయని పాల్గొన్నవారు పేర్కొన్నారుIMG-20251225-WA1880 .

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.