227లో అక్రమ షెడ్డుపై..! చర్యలేవి..?

చట్టాలంటే విలువ లేదు..! అధికారులకు బాధ్యత లేదు..!

227లో అక్రమ షెడ్డుపై..! చర్యలేవి..?

BackgroundEraser_20251210_153921707
బహుదూర్‌పల్లి 227 ప్రభుత్వ భూమిలో "తహశీల్దార్ నోటీసులు" ఇచ్చిన అక్రమ షెడ్డు..

 

227 ప్రభుత్వ భూమిగా నిర్ధారించినా..! సురేందర్ రెడ్డి షెడ్డుపై చర్యలు శూన్యం..

 

*జిల్లా అడిషనల్ కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి ఆదేశాలు బుట్టదాఖలు..

 

*నోటీసులిచ్చిన తహశీల్దార్ మతీన్ ఏడాదిన్నరగా చర్యలకు దూరం..ఆపై బదిలీ..*

 

సర్కారీ పోరంబోకు భూమిలో అక్రమ షెడ్డుకు అటు పలుకుబడి..! ఇటు ముడుపులు..?

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్,డిసెంబర్ 10:

 

మేడ్చల్ జిల్లా దుండిగల్‌ గండిమైసమ్మ మండలం, బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమి పరిరక్షణ విషయంలో సంబంధిత అధికారులు కొంత నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్టు అధికారుల పని తీరుతో తేటతెల్లం చేస్తుంది.. పాతికేళ్ళుగా హైకోర్టు పరిధిలోనే కేసు కొనసాగుతున్న 227 ప్రభుత్వ భూమి, 353.35 ఎకరాలు మొత్తం, సెక్షన్ 22-ఎ నిషేధిత జాబితాలోనూ ఉంది.. మరోవైపు హైకోర్టు డైరెక్షన్‌తో 2025 అక్టోబర్ 29న బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 మొత్తం సర్కారీ పోరంబోకు భూమిగానే, మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.. అయినప్పటికీ అడదడపా అక్రమ కట్టడాలు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నట్టు స్పష్టమవుతుంది.. గతేడాది 2024 ఏప్రిల్ నెలలో ఓ ప్రముఖ బిల్డర్ 227 ప్రభుత్వ భూమిలో 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డుకు "2024 మే 7న" నోటీసులు ఇచ్చిన దుండిగల్‌ ఎమ్మార్వో మతీన్, అక్రమార్కులతో భేరం కుదుర్చుకుని చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి.. మరోవైపు ఈ అక్రమ షెడ్డుపై చర్యలకు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఏడాదిన్నరగా ఆదేశించినా చర్యలు పక్కనపెట్టి మామూళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది..

 

నోటీసును చిత్తు కాగితంలా భావిస్తున్న రెవెన్యూ..

 

దుండిగల్‌ గండిమైసమ్మ మండలం రెవెన్యూ అధికారుల ఉద్దేశం ఏధైనా..? చట్టప్రకారం జారీసిన నోటీసులు అంటే విలువ లేదు.. అధికారులకు బాధ్యత లేదని నిరూపిస్తున్నారు.. నోటీసులంటే రెవెన్యూ యంత్రాంగం చిత్తుకాగితంలా భావిస్తున్నట్టు, రెవెన్యూ చర్యలు లేని ఈ అక్రమ షెడ్డు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.. 2024 మే 7న నోటీసులు జారీ చేసిన రెవెన్యూ అధికారులు, నేటికీ చర్యల్లేవంటే జిల్లా అడిషనల్ కలెక్టర్ సమాధానం చెప్పాలి..ఈ అక్రమ షెడ్డు వ్యవహారంలో మరో అనధికారిక సమాచారం కూడా వినిపిస్తుంది.. తెలంగాణ సీఎం కార్యాలయం నుండి ఫోన్‌లు చేయించారని, అందుకే దుండిగల్‌ తహశీల్దార్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి..ఇప్పటికే దుండిగల్‌ మండలం బౌరంపేట్‌ సర్వే నెం.166 ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వెంచర్‌కి సీసీరోడ్డు నిర్మాణం విషయంలోనూ..! సీఎం సన్నిహితుడి ఈ కబ్జాలకు సీఎంవో సిఫార్సులు చేశారని తెలిసిందే.. అయితే ప్రభుత్వ భూముల కబ్జాలకు సీఎంవో సిఫార్సులు సర్వసాధారణంగా మారాయని పలువురు ఎద్దేవా చేస్తున్నారు..

 

మేడ్చల్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం తీరుపై పత్రికల్లో వక్రీకరిస్తే తెగ ఫీలవుతారు.. మరి దుండిగల్‌ తహశీల్దార్ జారీచేసిన ఈ నోటీసుపై చర్యలు తీసుకోకుండా వదిలేయడాన్ని ఏవిధంగా పరిగణించాలి..? ముడుపులు స్వీకరించి వదిలేశారని అనాలా..? అక్రమ నిర్మాణ దారుడు సురేందర్'రెడ్డి' అయినందునే సామాజిక వర్గ పరంగా మేనేజ్ చేస్తున్నారని భావించాలా..? దుండిగల్‌ మండలంలో రెవెన్యూ అధికారుల పనితీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. బౌరంపేట్‌ ఇందిరమ్మ కాలనీలో పేదలపట్టాల పేరుతో ఖాళీస్థలాలను కబ్జాచేసి దందాలు.. దొమ్మర పోచంపల్లి సర్వే నెం.120 ప్రభుత్వ భూమిలో 59 జీవో పట్టాల పేరుతో, కబ్జాలు రెవెన్యూ కనుసన్నల్లో పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి.. కార్యాలయం పక్కనే సర్వే నెం.156లో ఓ అటవీశాఖ అధికారికి చెందిన అక్రమ నిర్మాణం..! గాగిల్లాపూర్‌‌లో భూదాన్ భూమిలో అక్రమ షెడ్లకు స్థానిక ఆర్ఐ సహకారం..? మల్లంపేట్‌‌లో సర్వే నెం.170/3, 170/4, 170/5, ఈ వెంచర్‌లో సుమారు 7.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు స్థానికులు గతేడాది చేసిన ప్రైవేటు సర్వేలో బయటపడి ఫిర్యాదు చేసినా..! దుండిగల్‌ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు..

Tags:

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts