నిందితుడు శివ ఆరోపణలు అవాస్తవం

కొత్తకోట సిఐ వివరణ

నిందితుడు శివ ఆరోపణలు అవాస్తవం

Screenshot_2026-01-24-13-07-57-09_6012fa4d4ddec268fc5c7112cbb265e7

కొత్తకోట, పెన్ పవర్ :

నిందితుడు కుంకుపూడి శివను పోలీసులు కొట్టారంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఖండించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ఓ కేసు దర్యాప్తు విషయమై కొత్తకోట ఎస్సై స్టేషన్కు పిలిపించారని, శివ వచ్చిన సమయంలో ఎస్సై స్టేషన్లో లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయిన శివ, కొంతమంది విలేకరులతో పోలీసులు తనను కొట్టారని చెప్పి సెల్  స్విచ్ ఆఫ్ చేశాడని అన్నారు. సాయంత్రం ఐదు గంటలకు వస్తానని స్టేషన్ లో చెప్పి వెళ్లిన శివ, ఇలా అబద్ధాన్ని ప్రచారం చేశాడని చెప్పారు. కొంతమంది మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకొని ప్రచారం చేయలేదని, కొంతమంది సోషల్ మీడియా విలేకరులు మాత్రం పోలీసులను వివరణ అడగకుండా ప్రచారం చేశారన్నారు. కొత్తకోటలో శివ కొంతమంది స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఓ పాన్ షాప్ పై దాడి చేశాడనే ఫిర్యాదు మేరకు అతడిని పిలిపించడం జరిగిందని, ఇంకా అతనిని విచారించకుండానే పోలీసులు కొట్టారంటూ డ్రామా రక్తి కట్టించాడని ఆరోపించారు. గతంలో  కుంకుపూడి శివపై పలు కేసులు ఉన్నాయని, ప్రతిసారి ఇతని ప్రవర్తన ఇలానే ఉంటుందని తెలిపారు. 2019లో కూడా అప్పటి ఎస్సై దామోదర్ నాయుడు స్టేషన్కు పిలిపించగా,  అప్పుడు ఇలాగే పోలీసులపై బురదజల్లే ప్రయత్నం చేశాడని గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో మీడియా మిత్రులు అధికారులతో మాట్లాడి వార్తలు ప్రచురించాలని కోరారు. ఇలాంటి అసంబద్ధమైన ప్రచారాల వల్ల ప్రజల్లో పోలీసులు పట్ల వ్యతిరేక భావం ఏర్పడుతుందని, అలా కాకుండా పూర్తి సమాచారాన్ని ప్రచారం చేయాలని కోరారు. కుంకుపూడి శివను పోలీసులు కొట్టారన్న వార్త పూర్తిగా నిరాధారమని సీఐ కోటేశ్వరరావు తెలిపారు.

 

Tags:

About The Author

Related Posts