ఎల్బీనగర్ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి: మల్ రెడ్డి రాంరెడ్డి
ఈ విషయమై స్థానికులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబుకు విన్నవించిన మల్ రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి: మల్ రెడ్డి రాంరెడ్డి
ఈ విషయమై స్థానికులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబుకు విన్నవించిన మల్ రెడ్డి రాంరెడ్డి
సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ
ఎల్బీనగర్ పెన్ పవర్ జనవరి 09:
ఎల్బీనగర్ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి కోరారు. ఎల్బీనగర్ ను ఇతర డివిజన్లలో కలపకుండా ఎల్బీనగర్ ను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎల్బీనగర్ వాసులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మల్ రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ లో కొంత భాగాన్ని ఇతర డివిజన్ లో కలిపిన విషయమై ఎల్బీనగర్ వాసులు తనను కలిసి విన్నవించారని తెలిపారు. ఈ విషయమై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. ఎల్బీనగర్ డివిజన్‌గా ఏర్పాటు చేసే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు హామినిచ్చారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, మాజీ డైరెక్టర్ ఆడాల రమేష్, స్థానికులు నిమ్మలూరి శ్రీనివాస్, ఎండీ జానిమియా, అల్లి భాస్కర్ యాదవ్, గుండెల కిరణ్ కుమార్, రాజ్ కుమార్, చంద్రశేఖర్, మెట్టు జీవన్ రెడ్డి, అరుణ్, అంబేద్కర్, చంద్ర శేఖర్ రెడ్డి, గుర్రం సతీష్, రాజు గౌడ్, ఆనంద్, కన్నా, జయంత్, కిట్టు, భానుచందర్, గోపి, అస్సాం, గణేష్ తదితరులు ఉన్నారు.

