చింతపల్లి ఐటిఐకి నూతన ప్రిన్సిపాల్ గా వై.రామ్మోహన్ రావు బాధ్యతల స్వీకరణ 

చింతపల్లి/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,డిసెంబర్ 16:అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ ఐటిఐలో నూతన ప్రిన్సిపాల్‌గా వై. రామ్మోహన్రావు,IMG-20251216-WA1308 తన పదవి బాధ్యతలు స్వీకరించారు.గతంలో డిఎల్టిసి, శ్రీకాకుళం‌లో అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తున్న ఆయన, చింతపల్లి ఐటిఐకి ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందడం గర్వకారణమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఏజెన్సీ ప్రాంతానికి ఇలా పదోన్నతి పొందడం చాలా ఆనందకరం. ఇక్కడి వాతావరణానికి త్వరగా అలవాటు అయ్యి, సంస్థను అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లడానికి, విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచడానికి నా వంతు కృషి చేస్తాను” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ సిబ్బంది ఆయనను స్వాగతించి పుష్పగుచ్చం అందించారు. అలాగే, ఐటిఐ శిక్షణ అధికారి రమణ, సూపెర్భింట్ నానీబాబు, సిబ్బంది రాంప్రసాద్, విద్యాసాగర్, ఆనంద్, దొర, లక్ష్మి, సతీష్, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.