పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా
చింతకాయల విజయ్
By SIVAKUMAR.L
On

నర్సీపట్నం, పెన్ పవర్ :
నిరుపేదల ఆరోగ్యానికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. గురువారం నర్సీపట్నంలో జరిగిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ, ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయనిధి ఆపద్బాంధవిలా నిలుస్తోందన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అర్హులైన బాధితులకు సత్వరమే సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం మండలాలకు చెందిన లబ్ధిదారులకు దాదాపు రూ. 4.50 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
Tags:
