గ్రేటర్ ఎన్నికల్లో మాదిగల వాటా తేల్చాలి: మేడి పాపయ్య మాదిగ
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మార్పీఎస్-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ
గ్రేటర్ ఎన్నికల్లో మాదిగల వాటా తేల్చాలి: మేడి పాపయ్య మాదిగ
కేసీఆర్ దళిత ద్రోహి
సీఎం రేవంత్ రెడ్డి దళితుల పక్షపాతి
21న దళిత సర్పంచులకు సన్మానం
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మార్పీఎస్-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ
ఎల్బీనగర్ పెన్ పవర్ జనవరి 03:
దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని దళితులను కేసీఆర్ నయవంచనకు గురి చేశారని ఎమ్మార్పీఎస్-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ విమర్శించారు. ఎమ్మార్పీఎస్-తెలంగాణ ఆధ్వర్యంలో ఉప్పల్ భగయాత్ వద్ద శనివారం జిహెచ్ఎంసి పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడి పాపయ్య మాదిగ హాజరై ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తామని నాడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను అణగదొక్కారని అన్నారు. దళితులను విస్మరించిన టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తరువాత సీఎం రేవంత్ రెడ్డి... ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించారని కొనియాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా వాటా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాదిగ కులస్తులు సిద్ధంగా ఉన్నారని, మా వాటాను త్వరగా తేల్చాలని కోరారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలుపొందిన ఎస్సీ అభ్యర్థులకు సన్మాన కార్యక్రమాన్ని ఈనెల 21వ తేదీన ఉప్పల్ భగయాత్ లో నిర్వహిస్తున్నామని, ఈ సన్మాన సభకు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, దామోదర రాజనర్సింహ, వివిధ పార్టీలకు చెందిన ఎస్సీ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈనెల 21వ తేదీన జరిగే సన్మాన సభ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్-తెలంగాణ కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలిరావాలని మేడి పాపయ్య మాదిగ కోరారు. అంతకుముందు మేడి పాపయ్య మాదిగను పుష్పగుచ్ఛాలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్-తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దాల రవికుమార్, నాయకులు రుక్కమ్మ, మంద జయన్న, భీమ్, లాజరస్, గణేష్, సుగుణమ్మ, ధనలక్ష్మి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

