ఎన్టీఆర్ నగర్ డివిజన్ ఏర్పాటు హర్షణీయం: ఎస్.కె.మహమ్మద్
బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం : ఎస్. కె మహమ్మద్
On
ఎన్టీఆర్ నగర్ డివిజన్ ఏర్పాటు హర్షణీయం: ఎస్.కె.మహమ్మద్
బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం
ఎల్బీనగర్ పెన్ పవర్ డిసెంబర్ 13:
మహేశ్వరం నియోజకవర్గంలో కొత్తగా ఎన్టీఆర్ నగర్ డివిజన్ ఏర్పాటు చేయడం హర్ష ణీయమని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు ఎస్.కె. మహమ్మద్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్లను 300 డివిజన్లుగా విస్తరింపజేసి దేశంలోనే అతిపెద్ద గ్రేటర్ గా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు మేలు జరిగేలా అన్ని రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బల్దియాపై కాంగ్రెస్ పార్టీ జెండ ఎగరవేయడం ఖాయమని ఎస్.కె.మహమ్మద్ ధీమా వ్యక్తం చేశారు.

Tags:
