CHIRANJEEVI VADTHYA

మియాపూర్ ఘటనపై జాతీయ ఎస్టి కమిషన్ స్పందన

మియాపూర్ ఘటనపై జాతీయ ఎస్టి కమిషన్ స్పందన మియాపూర్ ఘటనపై జాతీయ ఎస్టి కమిషన్ స్పందన    మియాపూర్ ప్రైవేట్ హాస్టల్‌లో జరిగిన బనోత్ నగేష్ అనుమానాస్పద మరణంపై జాతీయ ఎస్టీ కమిషన్ చర్య హైదరాబాద్ పెన్ పవర్ అక్టోబర్ 22 ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థి సభావట్.కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, మియాపూర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో మరణించిన బనోత్ నగేష్ (ఖమ్మం జిల్లా -యోనెకుంట తండా) కేసుపై జాతీయ ఎస్టి కమిషన్ (NCST) విచారణ ప్రారంభించింది. ఈ మేరకు, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు అక్టోబర్ 7, 2025 న నోటీసు జారీచేసి, 15 రోజుల్లోపు కేసు పురోగతి, చర్యల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. సమాధానం రాకపోతే, సివిల్ కోర్టు అధికారాలతో సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది.
Read...

శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్

శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ శివ మాలధారణ చేసిన సతీష్ కుమార్ గౌడ్, స్వాములు ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిత్యాన్నదానం ఎల్బీనగర్ పెన్ పవర్ అక్టోబర్ 22 శివ తత్వాన్ని విశ్వవ్యాప్తంగా తెలియజెప్పేందుకు తమవంతు కృషి చేస్తున్నామని శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు, సాహెబ్ నగర్ శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయ చైర్మన్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ లోని శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో బుధవారం ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి శివ మాలధారణ చేసి సుమారు 48 మంది స్వాములకు మాలలు వేశారు. అనంతరం దేవాలయంలో శివుడికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లుగా శివ మాలధారణ చేసి మండల కాలం పాటు దీక్షలు చేస్తున్నామని తెలిపారు. మాలధారణ చేసిన వందలాది మంది స్వాములకు దేవాలయ ప్రాంగణంలో ప్రతియేడు నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతినిత్యం వందలాది మంది స్వాములకు నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తమతోపాటు మండల కాలం పాటు దీక్షలు పూర్తయిన తరువాత స్వాములకు దేవాలయ ప్రాంగణంలో ఇరుముడులు కట్టించి వాహనాల్లో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలివెళ్లి తన సొంత ఖర్చులతో ఉచితంగా స్వామివారి స్పర్శ దర్శనంతో పాటు వసతిని కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. శివ మాలధారణ మండలం కాలం, అర్థ మండలం కాలం పాటు వేసుకోవచ్చునని ఆయన తెలిపారు. దీంతోపాటు శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధికి తనవంతు చర్యలు తీసుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో శివ స్వాములు, గురుస్వాములు పాల్గొన్నారు.
Read...

తెలంగాణ రాజకీయ వేధింపుల ఆత్మహత్య కేసుపై ఎన్‌హెచ్ఆర్సీ (NHRC) స్పందన

తెలంగాణ రాజకీయ వేధింపుల ఆత్మహత్య కేసుపై ఎన్‌హెచ్ఆర్సీ (NHRC) స్పందన తెలంగాణ రాజకీయ వేధింపుల ఆత్మహత్య కేసుపై ఎన్‌హెచ్ఆర్సీ (NHRC) స్పందన నాలుగు వారాల్లో చర్యా నివేదిక సమర్పించాలని ఆదేశం హైదరాబాద్ పెన్ పవర్ అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో రాజకీయ వేధింపుల కారణంగా జరిగినదిగా ఆరోపణలు ఉన్న ఆత్మహత్య కేసుపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) స్పూర్తిదాయక చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు మంచిర్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కు (SP) ఆదేశాలు జారీ చేసి, నాలుగు వారాల్లో చర్యా నివేదిక (ATR) సమర్పించాలని సూచించింది. ఈ ఫిర్యాదును న్యాయ శాస్త్ర విద్యార్థి సభావట్.కళ్యాణ్ 12 అక్టోబర్ 2025న ఎన్‌హెచ్ఆర్సీకి సమర్పించారు. మానవ హక్కుల సంఘం 17 అక్టోబర్ 2025న ఈ ఫిర్యాదును పరిశీలించి విచారణకు స్వీకరించింది. ఫిర్యాదుదారు పేర్కొన్న ప్రకారం, కొందరు ప్రత్యర్థి కాంగ్రెస్ నేతల మానసిక వేధింపుల కారణంగా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా, బాధితుడికి న్యాయం చేయాలని, నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కేసు మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు రాజకీయ వేధింపుల కోణంలో సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు ఎన్‌హెచ్ఆర్సీ స్పష్టం చేసింది.
Read...

అనాథ విద్యార్థినులను తీర్థ యాత్రలకు పంపిన భీష్మరాజ్ ఫౌండేషన్

అనాథ విద్యార్థినులను తీర్థ యాత్రలకు పంపిన భీష్మరాజ్ ఫౌండేషన్ ’పేట'లో బస్సును ప్రారంభించిన ఆర్టీసీ డీఎం లావణ్య భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను కొనియాడిన డీఎం సేవా రంగాల్లో ముందంజ: ఫౌండేషన్ సభ్యులు నారాయణపేట, పెన్ పవర్: సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహానికి చెందిన అనాథ విద్యార్థినులను, సిబ్బందిని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సహకారంతో నారాయణపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో సంబంధిత అధికారులు తీర్థ యాత్రకు తీసుకెళ్లారు. తీర్థ యాత్రకు సంబంధించిన బస్సును శనివారం ఉదయం నారాయణపేట బారంబాయిలోని సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహం వద్ద భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణపేటలో ఉన్న సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహానికి చెందిన అనాథ విద్యార్థినులను భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఆర్థిక సహకారంతో వారిని తీర్థ యాత్రకు తీసుకెళ్లడం అభినందనీయమని అన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని సూచించారు.  *సేవా కార్యక్రమాల్లో ముందంజ*    అందరి మాదిరిగానే అనాథ విద్యార్థినులకు కూడా అన్ని ప్రదేశాలు, తీర్థ యాత్రలకు వెళ్లాలని ఉంటుందని, వసతి గృహం నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి  చర్యలు చేపట్టి వారిని తీర్థ యాత్రకు పంపించడం జరిగిందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. దీంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ ఫౌండేషన్ ముందుకు సాగుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది శ్రీధర్, సురేష్, హన్మంతు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, శివరాజ్, సుదర్శన్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, మిస్కిన్ సంతోష్, వెంకటరావు, వై.సంతోష్, అశోక్, నందుకుమార్, చామకూర నగేష్, కృష్ణ యాదవ్, మన్నె గోపాల్, శ్రీనివాస్, సాంఘిక మహిళా శిశు సంక్షేమ వసతి గృహం అధికారులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
Read...

About The Author