పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఎల్బీనగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

 ఎల్బీనగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

తరలివచ్చిన వేలాది మంది బహుజనులు, రాజకీయ పార్టీల నేతలు

ఎల్బీనగర్ పెన్ పవర్ డిసెంబర్ 14:

బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించేందుకు ఆనాడు బహుజనులను కలుపుకొని వీరోచిత పోరాటాన్ని చేసిన తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో నెలకొల్పిన తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బహుజనులతో కలిసి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కోసం ఆనాడు పోరాటాన్ని కొనసాగించిన బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాపన్న గౌడ్ పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అన్నివర్గాల ప్రజలను కలుపుకొని నాడు గోల్కొండ కోటను ఏలిన మహనీయుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. మహనీయులు చూపిన మార్గంలో యువత పయనించి వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. అంతకుముందు శ్రీనివాస్ గౌడ్ ను, అతిథులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను బహూకరించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబాల మల్లేశం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండలి మాజీ చైర్మన్ కనకమామిడి స్వామిగౌడ్, పంజాల జైహింద్ గౌడ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, సామ రంగారెడ్డి, వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి, జీవీ సాగర్ రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్, కుంట్లూరు వెంకటేష్ గౌడ్, ముద్దగౌని సతీష్ గౌడ్, ఆకుల పవన్ గౌడ్, కొత్త రవీందర్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, బాలరాజ్ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణగౌడ్, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, చామకూర రాజు, వేముల కొండల్ గౌడ్, పాండు గౌడ్, దుర్గయ్య గౌడ్, రావుల రాజు గౌడ్, చందు గౌడ్, ఈశ్వరమ్మ యాదవ్, కూరేళ్ల వేములయ్య గౌడ్, మిద్దెల మల్లేశం గౌడ్, సుర్వి రాజు గౌడ్, సుర్వి వెంకటేష్ గౌడ్, పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, విజయ గౌడ్, బొమ్మ రఘురాం నేత, వేముల రాము నేత, భాతర ప్రసాద్ నేత, బొంగు వెంకటేష్ గౌడ్, మహేష్ గౌడ్, నీరజ గౌడ్, సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు పల్లె గణేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వీరమల్ల వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు కొత్త వెంకటేష్ గౌడ్, బొడిగె స్వామిగౌడ్, కోశాధికారి కొండూరు లక్ష్మీపతి గౌడ్, కార్యదర్శి వెంకటరమణ గౌడ్, సహాయ కార్యదర్శులు బత్తిని కిషన్ గౌడ్, రావుల సంతోష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు కిషోర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, రాజు గౌడ్, అశోక్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, తరుణ్ గౌడ్, రాకేష్ గౌడ్ వెంకటేష్ గౌడ్, రాంచరణ్ గౌడ్ లతోపాటు వేలాదిమంది బహుజనులు పాల్గొన్నారు.

IMG-20251214-WA0003IMG-20251214-WA0006

Tags:

About The Author

Related Posts