అంగరంగ వైభవంగా సిటీ కళాశాలలో స్త్రీ శక్తి దివాస్ వేడుకలు:

అంగరంగ వైభవంగా సిటీ కళాశాలలో స్త్రీ శక్తి దివాస్  వేడుకలు:

అంగరంగ వైభవంగా సిటీ కళాశాలలో స్త్రీ శక్తి దివాస్ వేడుకలు

హైదరాబాద్ పెన్ పవర్ నవంబర్ 19:

 సిటీ కళాశాల ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి స్త్రీ శక్తి దివాస్ వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఎబివిపి అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం సంపాదించుకున్న వీర వనిత ఝాన్సీ లక్ష్మి బాయి నేడు ఆమె చరిత్ర ఎందరికో స్ఫూర్తిదాయకం అని ఈ కాలంలో ప్రతి ఒక్క స్త్రీ ఝాన్సీ లక్ష్మీబాయి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు శంకర్ , శిరీష , రామ్ కుమార్, కళాశాల సెక్రటరీ శివమణి మరియు విద్యార్థి నాయకులు అంజి, సాగర్, రాహుల్, గణేష్, మరియు తదితర విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

IMG-20251119-WA0016

Tags:

About The Author

Related Posts