తుఫాన్ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ:తహసీల్దార్ హెచ్.అన్నాజీ రావు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 31:తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండల పరిధిలోని సపర్ల, ధారకొండ పునరావాస కేంద్రాలలో బాధిత కుటుంబాలకు ఈ సరుకులను తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు ఆదేశాల మేరకు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని సహాయక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ తెలిపారు.బాధిత కుటుంబాలకు బియ్యం, పప్పులు, నూనె,వంటి అవసరమైన వస్తువులను అందజేశారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.