దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలి: అల్లూరి జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్

*దేశ ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పాలి*

*ఘనంగా 'జాతీయ ఐక్యతా దినోత్సవం*

జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,అక్టోబర్ 31:భారతదేశం పౌరుల యొక్క ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పాలని, అదే ఏక్తా రన్ ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ అన్నారు.సర్ధార్ వల్లభ భాయి పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రీయ ఏక్తా రన్ కార్యక్రమం పోలీసు శాఖల ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్ వద్ద ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార ముఖ్య అతిధిగా పాల్గొని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజ తోకలసి రాష్ట్రీయ ఏక్తా రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి హోం శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని కొనియాడారు. నేడు ఆయన 149వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జయంతి వేడుకలను నిర్వహించు కుంటున్నామని అన్నారు. ఏకీకృత భారతదేశాన్ని రూపొందించే పనికి నాయకత్వం వహించాడని కొనియాడారు. దాదాపు 565 స్వయం పాలక రాచరిక రాష్ట్రాలను 1947 భారత స్వాతంత్య్ర చట్టం ద్వారా విలీనం చేసేందుకు ఒప్పించిన ఘనత ఆయనదని అన్నారు. జునాఘడ్, హైదరాబాద్, కాశ్మీర్ వంటి రాష్ట్రాలను కూడా ఆపరేషన్ పోలో పేరిట భారతదేశంలో విలీనం చేసిన మహనీయుడు పటేల్ అని వివరించారు. స్వతంత్ర దేశంలో జాతీయ సమైక్యత పట్ల అతని గల నిబద్ధత,స్ఫూర్తికి భారతదేశపు ఉక్కు మనిషి అనే పేరు తెచ్చిపెట్టిందని కలెక్టర్ గుర్తుచేశారు. అటువంటి మహనీయుని కృషి, దీక్ష, పట్టుదలను స్మరించుకుంటూ ఆయన జయంతిని ఏక్తా దివాస్ గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. దేశ సమగ్రతకు, ఐక్యతకు, భద్రతకు మేమంతా పాటుపడుతామని పునరుద్ఘాటించడానికే రన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఏడాది కాకుండా ప్రతి రోజు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ మనదేశం గొప్పతనాన్ని, ఐక్యతను యావత్ ప్రపంచానికి చాటిచెప్పాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ సాహిత్, డిఎస్పి ఎస్.కె. షహబాజ్ అహ్మద్ వివిధ శాఖల అధికారులు, పోలీసులు తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.