గ్రామ నక్షలో ఉన్నా..! భౌతికంగా మాయం..!

హైరైజ్ టవర్‌ల నిర్మాణాలతో..! బహుదూర్‌ పల్లికి పొంచి ఉన్న ముప్పు..?

గ్రామ నక్షలో ఉన్నా..! భౌతికంగా మాయం..!

బహుదూర్‌పల్లి విలేజ్ మ్యాప్‌లో ఉన్న, బండ్లబాట, శంకరమ్మ కుంట భౌతికంగా మాయమైన విషయం సంబంధిత అధికారులకైనా తెలుసో..? తెలియదో అర్ధం కాని పరిస్థితి.. ఓవైపు మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, మరోవైపు అధికారుల ధనార్జన దాహార్తికి, చెరువులు, నాలాలు కనుమరుగు అవుతున్నాయి.. కుండపోత వర్షాలతో హైదరాబాద్ మహానగరం జలమయం అవుతుంటే..! ఇప్పుడు నగర శివారు ప్రాంతాంలను కూడా, భవిష్యత్తు వరద విపత్తులకు పునాదులు వేస్తున్నారు.. హైరైజ్ టవర్‌ల నిర్మాణాలతో "చెరువులు-నాలాలు" బహిరంగంగానే ఆక్రమణలకు గురవుతుంటే..! సంబంధిత అధికారులు తప్పుడు నివేదికలు జారీచేసి, బడా నిర్మాణ సంస్థలకు అండగా ఉంటున్నారు.. అందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే పదుల సంఖ్యలో చెరువులు, నాలాలు, గొలుసుకట్టు కాలువలు ఉన్నాయి.. ప్రస్తుతం బహుదూర్‌పల్లి విలేజ్ పరిధిలో కనుమరుగు అయిన "శంకరమ్మ కుంట" బండ్లబాట, గ్రామ నక్షలోనే కనిపిస్తున్నాయి.. భౌతికంగా ఎక్కడున్నాయో తెలియడం లేదు.. నేరెళ్ళకుంట, కూడా ఆక్రమణకు సిద్దమవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. బహుదూర్‌పల్లి విలేజ్ మ్యాప్‌లో ఉన్న, బండ్లబాట, శంకరమ్మ కుంట భౌతికంగా మాయమైన విషయం సంబంధిత అధికారులకైనా తెలుసో..? తెలియదో అర్ధం కాని పరిస్థితి.. ఓవైపు మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, మరోవైపు అధికారుల ధనార్జన దాహార్తికి, చెరువులు, నాలాలు కనుమరుగు అవుతున్నాయి.. కుండపోత వర్షాలతో హైదరాబాద్ మహానగరం జలమయం అవుతుంటే..! ఇప్పుడు నగర శివారు ప్రాంతాంలను కూడా, భవిష్యత్తు వరద విపత్తులకు పునాదులు వేస్తున్నారు.. హైరైజ్ టవర్‌ల నిర్మాణాలతో "చెరువులు-నాలాలు" బహిరంగంగానే ఆక్రమణలకు గురవుతుంటే..! సంబంధిత అధికారులు తప్పుడు నివేదికలు జారీచేసి, బడా నిర్మాణ సంస్థలకు అండగా ఉంటున్నారు.. అందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే పదుల సంఖ్యలో చెరువులు, నాలాలు, గొలుసుకట్టు కాలువలు ఉన్నాయి.. ప్రస్తుతం బహుదూర్‌పల్లి విలేజ్ పరిధిలో కనుమరుగు అయిన "శంకరమ్మ కుంట" బండ్లబాట, గ్రామ నక్షలోనే కనిపిస్తున్నాయి.. భౌతికంగా ఎక్కడున్నాయో తెలియడం లేదు.. నేరెళ్ళకుంట, కూడా ఆక్రమణకు సిద్దమవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి..

 

సహజ సిద్దమైన నీటి ప్రవాహానికి, హైరైజ్ టవర్‌ల తాకిడితో "ఉక్కిరిబిక్కిరి"..!

 

బాబాఖాన్ లేక్ఐడి నెం .2856 చెరువు నాలాను 17 గుంటలు ప్రైమార్క్ కబ్జా..!

 

ప్రైమార్క్ కబ్జా వివాదం తేలక ముందే..! బహుదూర్‌పల్లిలో తెరపైకి మరో వివాదం..

 

బహుదూర్‌పల్లి విలేజ్ మ్యాప్‌లో ఉన్న బండ్లబాట, శంకరమ్మ కుంట ఎక్కడ..?

 

విలేజ్ మ్యాప్‌లో భద్రంగానే ఉన్నప్పటికీ..! భౌతికంగా కనుమరుగైన వైనం..

 

పట్టింపులేని సంబంధిత శాఖల అధికారుల విధులు.. పలుకుబడికే ప్రాధాన్యత..!

Screenshot_2025-10-30-18-35-04-02_6012fa4d4ddec268fc5c7112cbb265e7
బహుదూర్‌పల్లి విలేజ్ నక్షలో ఉన్న బండ్లబాట-శంకరమ్మకుంట..

 

 

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, అక్టోబర్ 30:

 

దుండిగల్‌ మండలం- దుండిగల్‌ మున్సిపల్ పరిధిలోని బహుదూర్‌పల్లి విలేజ్‌లో ప్రభుత్వ భూములతో పాటు.. సహజ సిద్దమైన జల ప్రవాహపు వనరుల ఆక్రమణలతో..! ఆ గ్రామస్తులను భవిష్యత్తు వరద ముంపుకు బీజం వేస్తున్నారు.. రూ. వేలకోట్లు విలువైన ప్రభుత్వ ఆస్తులను భూ కబ్జాదారులకు ధారాదత్తం చేస్తున్నారు.. ఈ వ్యవహారంలో స్థానిక చోటా మోటా నాయకుల అండతో పాటు..! సంబంధిత అధికార యంత్రాంగమే కీలకంగా సహకరిస్తున్నట్టు స్పష్టమవుతుంది.. బహుదూర్‌పల్లి బాబాఖాన్ లేక్ఐడి నెం.2856 చెరువు‌ నాలాను ప్రైమార్క్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి 2000 గజాలు ధారాదత్తం చేసిన ఘనత "నాలుగు శాఖల" అధికార యంత్రాంగానికే దక్కుతుంది.. సదరు ప్రైమార్క్ కబ్జాదారునికి, ప్రభుత్వ ఏదైనా సరే..! మంచి "పలుకుబడి" ఉండటంతో..! నాడు "బీఆర్ఎస్- నేడు కాంగ్రెస్" హయాంలో తన హవాను కొనసాగిస్తున్నాడు.. నిజానికి ఈ ప్రైమార్క్‌ని తప్పు బట్టకూడదు కూడా..! అధికారులు తమ విధులకు కట్టుబడి ఉంటే..! ఇలాంటి కబ్జాదారులు సాహసించరు.. కొందరు అవినీతి అధికారుల ప్రమేయంతో,ఇలాంటి నిర్మాణ సంస్థలు, హైదరాబాద్ మహా నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు.. కాస్త "పచ్చిగడ్డి" పడేస్తే మూగ జీవి గోమాత కూడా, పాలిస్తుంది.. కానీ నెల నెలా రూ.లక్షలు వెతనాలు పొందుతున్న అధికారులు, అమ్ముడు పోయి, ప్రజలను ప్రమాదంలో పెడుతున్నారు.. ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ..! అధికార యంత్రాంగం, అక్రమార్కుల నుండి తాంబూలం పుచ్చుకుని, అండగా ఉండటం పరిపాటిగా మారింది.. ప్రభుత్వం హైడ్రా లాంటి సంస్థలను ఏర్పాటు చేసినా..! పార్కుస్థలాల పరిరక్షణ, సామాన్యుల చిన్న చిన్న ఆక్రమణలపై చర్యలతో సరిపెడుతున్నారనే‌ విమర్శలు లేకపోలేదు.. ప్రస్తుతం తెలంగాణలో అధికార వ్యవస్థ "అలంకార ప్రాయంగా" మారిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

Screenshot_2025-10-30-10-03-38-51_6012fa4d4ddec268fc5c7112cbb265e7
గ్రామ నక్షలో ఉన్న వివరాలు.. స్పష్టంగా..

 

నక్షా చెబుతోంది..! నేలపై కనుమరుగైంది..!

 

దుండిగల్‌ మండలం బహుదూర్‌పల్లి విలేజ్‌ లోని సహజ జలవనరులు హైరైజ్ టవర్‌ల కింద ఒక్కొక్కటిగా ఆక్రమణలకు గురవుతున్నాయి.. గ్రామ నక్షను అనుసరించాల్సిన, అధికార యంత్రాంగం, అమ్ముడు పోయి, తప్పుడు స్కెచ్‌ప్లాన్‌లు ఇస్తున్నారు.. ప్రధానంగా ప్రైమార్క్ కింద నాలా కబ్జా భూ స్థాపితం చేసిన అధికారులు.. బహుదూర్‌పల్లి విలేజ్ మ్యాప్‌లో ఉన్న "బండ్లబాట"–"శంకరమ్మకుంట"  కనుమరుగు అయింది.. సర్వే నెంబర్లు: 156, 152, 162, 163, 165, 171, 151, 147, 123, 122 పరిధిలో ఈ "బండ్లబాట- శంకరమ్మ కుంట వివాదం తలెత్తినట్టు సమాచారం.. ఈ విషయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో , స్థానిక నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళినా ప్రయోజనం శూన్యం..

 

ఒకప్పుడు పొలాలకు వెళ్ళిన బండ్లబాట..

 

బహుదూర్‌పల్లి గ్రామ నక్షలో స్పష్టంగా నమోదైన రెండు సహజ భూ సూచకాలు.. “బండ్లబాట” మరియు “శంకరమ్మకుంట” ఇప్పుడు భౌతికంగా కనిపించడం లేదు. ఒకప్పుడు గ్రామస్తులు పొలాలకు వెళ్లే దారిగా, పశువులు నీరు తాగే చెరువుగా పనిచేసిన ఈ ప్రదేశాలు, ఇప్పుడు హైరైజ్ టవర్‌ల నీడలో మాయం అయ్యాయని ఆరోపిస్తున్నారు.. హైరైజ్ టవర్‌ల దెబ్బకు సహజ నీటి ప్రవాహాలు (సర్‌ప్లస్ నాలాలు) ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని..! ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టతను ఇస్తుంది.. బహుదూర్‌పల్లి పరిధిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగుతున్న సమయంలో, సహజ జల ప్రవాహ మార్గాలు,కుంచించుకు పోయాయి.. పూర్తిగా మూసుకుపో బాబాఖాన్ లేక్ఐడి నెం. 2856 చెరువు నాలాలోని 17 గుంటల భూమిని “ప్రైమార్క్” సంస్థ కబ్జా చేసినది తెలిసిందేనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు..

 

కుంచించుకు పోయిన గొలుసుకట్టు కాలువ..

 

కేవలం నీటిపారుదల శాఖ పర్యవేక్షణా లోపం..! దుండిగల్‌ రెవెన్యూ యంత్రాంగం గ్రామ నక్షను పరిగణలోకి తీసుకోకపోవడం, హైరైజ్ నిర్మాణ దారులకు మేలు చేస్తున్నారు.. అధికారుల అలసత్వం, బహుదూర్‌పల్లి గ్రామం వరద విపత్తులకు గురి చేస్తున్నారు.. సూరారం "లింగం చెరువులో‌ కలిపే, సర్‌ప్లస్ నీటి మార్గం, గొలుసుకట్టు కాలువకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతున్నాయి.. మరోవైపు లింగం చెరువు బఫర్‌లో అపార్ట్‌మెంట్ నిర్మాణాలు ఉన్నప్పటికీ, ఇరిగేషన్ ఎన్‌వోసి జారీచేయడం విశేషం..  

 

బహుదూర్‌పల్లి గ్రామంలో హెచ్ఎండిఏ అనుమతులతో నిర్మించే హైరైజ్ టవర్‌ల నిర్మాణాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.. లేకపోతే భవిష్యత్తు ప్రమాదాలకు కారణమవుతారు.. విలేజ్‌లో రైతుల భూములను కొనుగోలు చేసి, ప్రైమార్క్-1 అండ్ ప్రైమార్క్-2 తోపాటు, కల్పవృక్ష హైరైజ్ టవర్‌లు నిర్మించే పరిసరాలలో, సహజ నీటి ప్రవాహాలు, బండబాట- శంకరమ్మ కుంట కనుమరుగైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.. పలుకుబడితో నిర్మించే ఈ బడా నిర్మాణ సంస్థల హైరైజ్ టవర్‌లు, బహుదూర్‌పల్లి విలేజ్‌కి పరిసర, కాలనీలకు ప్రమాదాలు తలపెట్టక ముందే ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ ముందు జాగ్రత్త వహిస్తే బావుంటుందని స్థానికులు కోరుతున్నారు.. ఒకప్పుడు దాదాపు 30 ఫీట్ల విస్తీర్ణంలో ప్రవహించిన నాలా ఎక్కడికక్కడ కుదింపుకు గురైనట్లు తెలుస్తోంది.. కల్పవృక్ష నిర్మాణ దారులు నర్సాపూర్ హైవే సర్వీస్ రోడ్డులో నాలా మళ్ళింపు అందుకు నిదర్శనం.. లింగం చెరువుకు వెళ్ళే సర్‌ప్లస్ నీటి ప్రవాహం ఆక్రమణలతో కుంచించుకు పోయింది.. వెంటనే అప్రమత్తం కాకపొతే, భవిష్యత్తు ప్రమాదాలకు అధికారులే కారణం అవుతారు తస్మాత్ జాగ్రత్త..

 

ఈ విషయంపై గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే భద్రత ఉందని..! పరిపాలనా సౌలభ్యం పేరుతో మున్సిపాలిటీగా ఆవిర్భావం తర్వాతే మరిన్ని సహజ నీటి వనరులు అంతరించి పోతున్నాయని విమర్శలు.. రెవెన్యూ అధికారులు, హెచ్‌ఎమ్‌డీఏ, అధికారులు, ఎవరూ స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు.. ఫైళ్లలో, మ్యాప్‌లలో మాత్రం ఆ బండ్లబాట–శంకరమ్మకుంట పేర్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. కానీ నేలపై వాటి ఆచూకీ లేదు.. మ్యాప్‌లో ఉన్న భూభాగాలు భౌతికంగా ఎలా మాయమయ్యాయి? ఈ మార్పులకు ఎవరు ఆమోదం తెలిపారు..? సహజ నీటి మార్గాలను పునరుద్ధరించే ప్రణాళిక ఉందా..? అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు..? మ్యాప్‌లో పదిలమైన బండ్లబాట-శంకరమ్మకుంట, కనుమరుగవడం కేవలం పత్రికల్లో వచ్చే కథనాలు కాదు..! ప్రకృతిని నశింపజేసి భావితరాలకు శూన్యాన్ని మిగిల్చే భయంకర ఘటన.. నగర విస్తరణ చరిత్రలో మరో అధ్యాయం..!

 

 

 

 

 

 

Tags:

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts