MADHAV PATHI

227లో అక్రమ షెడ్డుపై..! చర్యలేవి..?

227లో అక్రమ షెడ్డుపై..! చర్యలేవి..? బహుదూర్‌పల్లి 227 ప్రభుత్వ భూమిలో "తహశీల్దార్ నోటీసులు" ఇచ్చిన అక్రమ షెడ్డు..    227 ప్రభుత్వ భూమిగా నిర్ధారించినా..! సురేందర్ రెడ్డి షెడ్డుపై చర్యలు శూన్యం..    *జిల్లా అడిషనల్ కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి ఆదేశాలు బుట్టదాఖలు..    *నోటీసులిచ్చిన తహశీల్దార్ మతీన్ ఏడాదిన్నరగా చర్యలకు దూరం..ఆపై...
Read...

దుండిగల్‌ జీహెచ్ఎంసి సర్కిల్.. గాగిల్లాపూర్‌‌లో కూల్చివేతలు..

దుండిగల్‌ జీహెచ్ఎంసి సర్కిల్.. గాగిల్లాపూర్‌‌లో కూల్చివేతలు.. దుండిగల్‌ సర్కిల్ గాగిల్లాపూర్‌‌లో టౌన్‌ప్లానింగ్ కూల్చివేతలు..    *గాగిల్లాపూర్‌‌లో 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన గదులు..*    *జీహెచ్ఎంసిలో విలీనమైన దుండిగల్‌ మున్సిపాలిటీలో "తొలి కూల్చివేతలు"..*    *సర్వే నెం.235 భూమి కోర్టు వివాదంలో ఉండగా.!జీహెచ్ఎంసి పర్మిషన్‌ కూడా లేదు..*   *పత్రికల్లో...
Read...

జీహెచ్ఎంసిలో..! 27 "మున్సిపాలిటీలు" విలీనం..

జీహెచ్ఎంసిలో..! 27 జీహెచ్ఎంసీలో 27 సమీప మున్సిపాలిటీల విలీనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. విలీనం ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్లుగా వ్యవహరిస్తారని ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ (ఐఏఎస్) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.. ఉత్తర్వులు కూడా, తక్షణమే అమల్లోకి వచ్చినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు..
Read...

అటవీ కబ్జాపై.. "ఎన్‌జిటి" కీలక ఆదేశాలు..

అటవీ కబ్జాపై.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ చెన్నై..    గాజులరామారం అటవీశాఖ భూభాగం కబ్జా వివాదంపై "ఎన్‌జిటి సౌత్ జోన్" చెన్నై కీలక ఆదేశాలు జారీచేసింది.. సర్వే నెం.19 మొత్తానికి మరోసారి సరిహద్దులు నిర్ధారించాలని, చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్‌ జోన్,...
Read...

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం..!

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం..! అగ్నికి ఆహుతైన కీలక ఫైళ్లు.. ప్రమాద సమయంలో విధుల్లో 8 మంది సిబ్బంది.. సకాలంలో స్పందించిన జీడిమెట్ల పోలీసులు.. సిబ్బంది సురక్షితం.. కుత్బుల్లాపూర్, పెన్ పవర్, నవంబర్ 13: మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ జీహెచ్ఎంసి సర్కిల్-25 కార్యాలయం లోని రెవెన్యూ విభాగంలో,...
Read...

సర్వే నెం.227లో 353.35 ఎకరాలు..! పోరంబోకు భూమిగా నిర్ధారణ..!

 సర్వే నెం.227లో 353.35 ఎకరాలు..! పోరంబోకు భూమిగా నిర్ధారణ..! బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిపై సంచలన తీర్పు.. కేసు నంబర్: E1/229/2024.. తేదీ: 29 అక్టోబర్ 2025న తీర్పు వెల్లడించారు.. 2004 నాటి హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపణ..! 2009-09-09న ప్రభుత్వ భూమిగా ప్రొసీడింగ్ జారీపై సొసైటీ అభ్యంతరం.....
Read...

'వర్టెక్స్' భారీ అక్రమ షెడ్డుకు..! అనుమతులేవి "టిపిఎస్"గారు..!

'వర్టెక్స్' భారీ అక్రమ షెడ్డుకు..! అనుమతులేవి దుండిగల్ మున్సిపాలిటీలో అధికారుల విధుల నిర్వహణ ప్రజలను ప్రమాదంలో పెడుతుంది.. టిజి-బిపాస్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ,అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారు.. అధికారుల తీరుపై పలువురికి ఆగ్రహం తెప్పిస్తున్న వైనం.. ప్రమాదాలను నివారించే నిబంధనలు పాటించకుండా..! నిధులు సమకూరితే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.. నిబంధనలకు తిలోదకాలు పలికి, మున్సిపల్ వ్యాప్తంగా అక్రమ షెడ్లు, అక్రమ కట్టడాలతో పేరుకు పోయింది.. విజిలెన్స్ వ్యవస్థను కూడా మున్సిపల్ అధికారులు మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం..
Read...

అక్రమ నిర్మాణాలపై.. రెవెన్యూ "ఉక్కుపాదం"..!

అక్రమ నిర్మాణాలపై.. రెవెన్యూ బాచుపల్లి మండలంలో రెవెన్యూ కూల్చివేతలు..    బాచుపల్లి-నిజాంపేట్‌" ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ..! తహశీల్దార్ వాణిరెడ్డి ఆదేశాలతో ఆర్ఐల ఆధ్వర్యంలో కూల్చివేతలు.. బాచుపల్లి సర్వే నెం.290, 292 మరియు నిజాంపేట్ సర్వే నెం.191లో నిర్మాణాలు.. గ్రామానికో "జిపివో" నియామకం ప్రభుత్వ భూముల...
Read...

గ్రామ నక్షలో ఉన్నా..! భౌతికంగా మాయం..!

గ్రామ నక్షలో ఉన్నా..! భౌతికంగా మాయం..! బహుదూర్‌పల్లి విలేజ్ మ్యాప్‌లో ఉన్న, బండ్లబాట, శంకరమ్మ కుంట భౌతికంగా మాయమైన విషయం సంబంధిత అధికారులకైనా తెలుసో..? తెలియదో అర్ధం కాని పరిస్థితి.. ఓవైపు మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, మరోవైపు అధికారుల ధనార్జన దాహార్తికి, చెరువులు, నాలాలు కనుమరుగు అవుతున్నాయి.. కుండపోత వర్షాలతో హైదరాబాద్ మహానగరం జలమయం అవుతుంటే..! ఇప్పుడు నగర శివారు ప్రాంతాంలను కూడా, భవిష్యత్తు వరద విపత్తులకు పునాదులు వేస్తున్నారు.. హైరైజ్ టవర్‌ల నిర్మాణాలతో "చెరువులు-నాలాలు" బహిరంగంగానే ఆక్రమణలకు గురవుతుంటే..! సంబంధిత అధికారులు తప్పుడు నివేదికలు జారీచేసి, బడా నిర్మాణ సంస్థలకు అండగా ఉంటున్నారు.. అందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే పదుల సంఖ్యలో చెరువులు, నాలాలు, గొలుసుకట్టు కాలువలు ఉన్నాయి.. ప్రస్తుతం బహుదూర్‌పల్లి విలేజ్ పరిధిలో కనుమరుగు అయిన "శంకరమ్మ కుంట" బండ్లబాట, గ్రామ నక్షలోనే కనిపిస్తున్నాయి.. భౌతికంగా ఎక్కడున్నాయో తెలియడం లేదు.. నేరెళ్ళకుంట, కూడా ఆక్రమణకు సిద్దమవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. బహుదూర్‌పల్లి విలేజ్ మ్యాప్‌లో ఉన్న, బండ్లబాట, శంకరమ్మ కుంట భౌతికంగా మాయమైన విషయం సంబంధిత అధికారులకైనా తెలుసో..? తెలియదో అర్ధం కాని పరిస్థితి.. ఓవైపు మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులు, మరోవైపు అధికారుల ధనార్జన దాహార్తికి, చెరువులు, నాలాలు కనుమరుగు అవుతున్నాయి.. కుండపోత వర్షాలతో హైదరాబాద్ మహానగరం జలమయం అవుతుంటే..! ఇప్పుడు నగర శివారు ప్రాంతాంలను కూడా, భవిష్యత్తు వరద విపత్తులకు పునాదులు వేస్తున్నారు.. హైరైజ్ టవర్‌ల నిర్మాణాలతో "చెరువులు-నాలాలు" బహిరంగంగానే ఆక్రమణలకు గురవుతుంటే..! సంబంధిత అధికారులు తప్పుడు నివేదికలు జారీచేసి, బడా నిర్మాణ సంస్థలకు అండగా ఉంటున్నారు.. అందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే పదుల సంఖ్యలో చెరువులు, నాలాలు, గొలుసుకట్టు కాలువలు ఉన్నాయి.. ప్రస్తుతం బహుదూర్‌పల్లి విలేజ్ పరిధిలో కనుమరుగు అయిన "శంకరమ్మ కుంట" బండ్లబాట, గ్రామ నక్షలోనే కనిపిస్తున్నాయి.. భౌతికంగా ఎక్కడున్నాయో తెలియడం లేదు.. నేరెళ్ళకుంట, కూడా ఆక్రమణకు సిద్దమవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి..
Read...

ఆ నాలుగు శాఖలకు..! ప్రైమార్క్ దిమ్మతిరిగే ట్విస్ట్..

ఆ నాలుగు శాఖలకు..! ప్రైమార్క్ దిమ్మతిరిగే ట్విస్ట్.. మేం అధికారులం..! మేం ఏం చెబితే అదే చట్టం..! ఈ ధోరణితో తెలంగాణలో సిస్టమ్ శిధిలావస్థకు చేరుకుంది..? ప్రశ్నించే తత్వం మూగ బోయింది..? అధికారుల్లో జవాబుదారీతనం కనుమరుగైంది.. ఒక చెరువు నాలా కబ్జా వ్యవహారంలో సర్వేయర్ చేతివాటం..! ఆ గ్రామస్తులకు శాపంగా తయారైంది.. దుండిగల్‌ మండలంలో సర్వేయర్ శ్రీనివాస్‌చారి, అప్పటి తహశీల్దార్ కలిసి (2019లో) తప్పుడు స్కెచ్‌ప్లాన్ జారీతో హెచ్ఎండిఏ అనుమతులు లభించాయి.. ఒక తప్పు పది తప్పులను ప్రేరేపిస్తుందని, ప్రైమార్క్ నాలా కబ్జాతో నిరూపితమైంది.. సర్వేయర్ చేసిన తప్పును సక్రమం చేసేందుకు, మిగతా నాలుగు శాఖల అధికారులు తప్పుమీద తప్పు చేస్తూనే ఉన్నారు.. లాభాన్ని అర్జించకుండా సాధ్యం కాదుకూడా..! అదే ఇప్పుడు అధికారులకు రివర్స్ అయింది.. అధికార యంత్రాంగం సూచనలతోనే జరిగిందో..! లేక ప్రైమార్క్ నిర్మాణ సంస్థ అతితెలివి ప్రదర్శించిందో..! తెలియదు కానీ..! అధికారులు తమకుతామే ఉచ్చు బిగించుకున్నామని లోలోపల ఆందోళన చెందుతున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రైమార్క్ నిర్మాణ సంస్థ, తన పబ్బం గడుపు కోవడానికి "నయానో బయానో" అధికారులను ప్రలోభాలకు పెట్టి.. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన వెంటనే ప్రైమార్క్ యాజమాన్యం తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. బహుదూర్‌పల్లి నాలా కబ్జా వ్యవహారంలో అధికారులకు ట్విస్ట్ ఇచ్చిన ప్రైమార్క్..మేం అధికారులం..! మేం ఏం చెబితే అదే చట్టం..! తెలంగాణలో సిస్టమ్ శిధిలావస్థకు చేరుకుంది..? ప్రశ్నించే తత్వం మూగ బోయింది..? అధికారుల్లో జవాబుదారీతనం కనుమరుగైంది.. ఒక చెరువు నాలా కబ్జా వ్యవహారంలో సర్వేయర్ చేతివాటం..! ఆ గ్రామస్తులకు శాపంగా తయారైంది.. దుండిగల్‌ మండలంలో సర్వేయర్ శ్రీనివాస్‌చారి, అప్పటి తహశీల్దార్ కలిసి (2019లో) తప్పుడు స్కెచ్‌ప్లాన్ జారీతో హెచ్ఎండిఏ అనుమతులు లభించాయి.. ఒక తప్పు పది తప్పులను ప్రేరేపిస్తుందని, ప్రైమార్క్ నాలా కబ్జాతో నిరూపితమైంది.. సర్వేయర్ చేసిన తప్పును సక్రమం చేసేందుకు, మిగతా నాలుగు శాఖల అధికారులు తప్పుమీద తప్పు చేస్తూనే ఉన్నారు.. లాభాన్ని అర్జించకుండా సాధ్యం కాదుకూడా..! అదే ఇప్పుడు అధికారులకు రివర్స్ అయింది.. అధికార యంత్రాంగం సూచనలతోనే జరిగిందో..! లేక ప్రైమార్క్ నిర్మాణ సంస్థ అతితెలివి ప్రదర్శించిందో..! తెలియదు కానీ..! అధికారులు తమకుతామే ఉచ్చు బిగించుకున్నామని లోలోపల ఆందోళన చెందుతున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రైమార్క్ నిర్మాణ సంస్థ, తన పబ్బం గడుపు కోవడానికి "నయానో బయానో" అధికారులను ప్రలోభాలకు పెట్టి.. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన వెంటనే ప్రైమార్క్ యాజమాన్యం తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. బహుదూర్‌పల్లి నాలా కబ్జా వ్యవహారంలో అధికారులకు ప్రైమార్క్ ట్విస్ట్ ఇచ్చింది..
Read...

తహశీల్దార్ ఆఫీసు ఎదుటే.. గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం..

తహశీల్దార్ ఆఫీసు ఎదుటే.. గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం..  మండలంలో తహశీల్దార్ మతీన్‌ ప్రభుత్వ భూములు అంటూ నోటీసులు ఇవ్వడం..! కబ్జాదారులు, అక్రమ నిర్మాణాల నుండి తాంబూలం పుచ్చుకోవడం కొత్తేమి కాదు..! ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళినా..! పలుకుబడితో బదిలీని‌ కూడా రద్దుచేసుకునే సత్తా, సారుకు ఉందని, ఇక్కడే విధుల్లో కొనసాగడానికి, తీవ్ర కృషి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. తహశీల్దార్ మతీన్ నోటీసుల డ్రామా వ్యవహారం మచ్చుకు కొన్ని "పెన్ పవర్" దినపత్రిక పాఠకుల కోసం ఈరోజు.. బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో 400 గజాల్లో సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుకు 2024 మే 7న నోటీసులు జారీచేసిన తహశీల్దార్..ఏ కారణం లేకుండానే ఏడాదిన్నర గడిచినా చర్యల్లేవు.. ఆ తర్వాత ఈ తహశీల్దార్ మరో ఘనకార్యం కూడా చేశారు.. 227 ప్రభుత భూమిలో నోటీసులు జారీ చేసిన చోటనే.. స్థానిక ఎమ్మెల్యే కబ్జాదారులకు, ప్రభుత్వ నిధులు రూ.60 లక్షలు (ఎస్‌డిఎఫ్) నిధులతో సీసీరోడ్డు మంజూరు చేయిస్తే..! తహశీల్దార్ మతీన్ హైకోర్టును ధిక్కరించి, బాధ్యతా రహితంగా ప్రభుత్వ భూమిలో సీసీరోడ్డు నిర్మాణానికి సహకరించారు..దుండిగల్‌ మండలంలో తహశీల్దార్ మతీన్‌ ప్రభుత్వ భూములు అంటూ నోటీసులు ఇవ్వడం..! కబ్జాదారులు, అక్రమ నిర్మాణాల నుండి తాంబూలం పుచ్చుకోవడం కొత్తేమి కాదు..! ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళినా..! పలుకుబడితో బదిలీని‌ కూడా రద్దుచేసుకునే సత్తా, సారుకు ఉందని, ఇక్కడే విధుల్లో కొనసాగడానికి, తీవ్ర కృషి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. తహశీల్దార్ మతీన్ నోటీసుల డ్రామా వ్యవహారం మచ్చుకు కొన్ని "పెన్ పవర్" దినపత్రిక పాఠకుల కోసం ఈరోజు.. బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో 400 గజాల్లో సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుకు 2024 మే 7న నోటీసులు జారీచేసిన తహశీల్దార్..ఏ కారణం లేకుండానే ఏడాదిన్నర గడిచినా చర్యల్లేవు.. ఆ తర్వాత ఈ తహశీల్దార్ మరో ఘనకార్యం కూడా చేశారు.. 227 ప్రభుత భూమిలో నోటీసులు జారీ చేసిన చోటనే.. స్థానిక ఎమ్మెల్యే కబ్జాదారులకు, ప్రభుత్వ నిధులు రూ.60 లక్షలు (ఎస్‌డిఎఫ్) నిధులతో సీసీరోడ్డు మంజూరు చేయిస్తే..! తహశీల్దార్ మతీన్ హైకోర్టును ధిక్కరించి, బాధ్యతా రహితంగా ప్రభుత్వ భూమిలో సీసీరోడ్డు నిర్మాణానికి సహకరించారు.. బౌరంపేట్‌ సర్వే నెం.166/1, 166/3 లావణ్య పట్టా భూమి క్రయ విక్రయాలు, చిన్న షెడ్డు నిర్మాణ వ్యవహారంలో..! 2025 ఫిబ్రవరి 20న రెండు నోటీసులు ఇచ్చిన దుండిగల్‌ తహశీల్దార్ మతీన్..! అదే స్థలాన్ని రెండు బడా నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సీసీరోడ్డు నిర్మాణం చేపట్టడంలో, సారు కీలకంగా సహకరించారు.. మరికొన్ని ప్రభుత్వ భూముల వ్యవహారంలోనూ, ఎన్‌వోసిలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న తహశీల్దార్.. ఓ గిరిజనుడి నుండి రూ.6 లక్షలు డిమాండ్ చేసి, లంబాడ యువకుని ఆత్మహత్యాయత్నానికి కారకుడు అయ్యాడని బాధితుని ఆరోపణలతో బట్టబయలు అయింది.. తన భూమిని "బడా నిర్మాణ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంపై తనకు న్యాయం కావాలంటూ బాధితుడు సిద్దూ నాయక్  ఆవేదనతో..! దుండిగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది..*బౌరంపేట్‌ సర్వే నెం.166/1, 166/3 లావణ్య పట్టా భూమి క్రయ విక్రయాలు, చిన్న షెడ్డు నిర్మాణ వ్యవహారంలో..! 2025 ఫిబ్రవరి 20న రెండు నోటీసులు ఇచ్చిన దుండిగల్‌ తహశీల్దార్ మతీన్..! అదే స్థలాన్ని రెండు బడా నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సీసీరోడ్డు నిర్మాణం చేపట్టడంలో, సారు కీలకంగా సహకరించారు.. మరికొన్ని ప్రభుత్వ భూముల వ్యవహారంలోనూ, ఎన్‌వోసిలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న తహశీల్దార్.. ఓ గిరిజనుడి నుండి రూ.6 లక్షలు డిమాండ్ చేసి, లంబాడ యువకుని ఆత్మహత్యాయత్నానికి కారకుడు అయ్యాడని బాధితుని ఆరోపణలతో బట్టబయలు అయింది.. తన భూమిని "బడా నిర్మాణ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంపై తనకు న్యాయం కావాలంటూ బాధితుడు సిద్దూ నాయక్  ఆవేదనతో..! దుండిగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది..  
Read...

అధికారుల సమన్వయంతో..! చెరువు నాలా భూ స్థాపితం..!

అధికారుల సమన్వయంతో..! చెరువు నాలా భూ స్థాపితం..! ఒక్కరోజు కురిసిన భారీవర్షానికే.. హైదరాబాద్ నగరం రోడ్లపై పడవల్లో తిరుగుతున్న అధికార యంత్రాంగం, హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువుల కబ్జాలపై నిర్లక్ష్యం వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.. ముఖ్యంగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నాలా కబ్జా పరిశీలనలో భాగంగా, బహుదూర్‌పల్లి ప్రైమార్క్ కబ్జాను (2025 మార్చి 13న సందర్శించి.. నాలా కబ్జాను గుర్తించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చర్యలు తీసుకోక పోగా.. ఆక్రమణ దారుల ప్రైమార్క్ హైరైజ్ టవర్‌లకు "మార్చి 19న" హెచ్ఎండిఏ నుండి "ఆక్యుపెన్సీ సర్టిఫికేట్" ఇవ్వడం గమనార్హం.. 2000 గజాల బాబాఖాన్ చెరువు నాలా స్థలాన్ని ఆ నాలుగు శాఖలు అమ్ముకున్నారా..? నాలా ఉన్నట్టు "పాత చిత్రాల" ఆధారాలు, రెవెన్యూ, ఇరిగేషన్ జాయింట్ సర్వే నివేదికలతో "పెన్ పవర్" దినపత్రికలో గత మూడేళ్ళుగా వార్తా కథనాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్‌తో సహా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం శూన్యం.. చివరికి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఆ నాలుగు శాఖల  అధికారులు అనుకున్నదే చేశారు..! ఈ వ్యవహారంతో ప్రైమార్క్ కబ్జాదారుల నుండి తీసుకున్న ముడుపులకు, న్యాయం చేశారని స్పష్టమవుతుంది.. చెరువు నాలా కబ్జాకు గురైందనే దానికంటే..! ఒప్పందం ప్రకారం కబ్జాదారునికి అప్పగించామనే సంతృప్తిని అధికారులకు మిగిల్చినట్టు తెలుస్తోంది.. మరోవైపు హెచ్ఎండిఏ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీపై, హైకోర్టును ఆశ్రయించిన, విల్లాల బాధితుల అభ్యంతరం చెప్పకపోవడంలో పలు అనుమానాలను రేకెత్తిస్తుంది.. నాలా ఆక్రమణ బాధితుల మౌనంపై భిన్న కథనాలు వస్తున్నాయి..వారిని కూడా మేనేజ్ చేశారేమో అంటూ ఆరోపణలు లేకపోలేదు..
Read...

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.