అక్రమ నిర్మాణాలపై.. రెవెన్యూ "ఉక్కుపాదం"..!
బాధ్యతలు చేపట్టిన రోజే.. సత్తా చాటిన బాచుపల్లి తహశీల్దార్..
- బాచుపల్లి-నిజాంపేట్" ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ..!
- తహశీల్దార్ వాణిరెడ్డి ఆదేశాలతో ఆర్ఐల ఆధ్వర్యంలో కూల్చివేతలు..
- బాచుపల్లి సర్వే నెం.290, 292 మరియు నిజాంపేట్ సర్వే నెం.191లో నిర్మాణాలు..
- గ్రామానికో "జిపివో" నియామకం ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చేందుకు..
మేడ్చల్ జిల్లాలో తహశీల్దార్‌ల బదిలీలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పెను మార్పులు.. దుండిగల్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్ మండలాల్లో నూతన తహశీల్దార్‌లు బాధ్యతలు చేపట్టి, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దృష్టి సారించారు.. ఈ నేపథ్యంలో కబ్జాదారులకు గుబులు పుట్టించే విధంగా రెవెన్యూ కొరడా జుళిపిస్తుంది.. గతంలో ఉన్న తహశీల్దార్‌లు కొందరు పలుకుబడితో సుదీర్ఘ కాలం విధుల్లో కొనసాగగా.. మరొకరు, యూనియన్ నాయకుల హోదాలో ఒకేచోట విధులు, నిర్వర్తించింది తెలిసిందే.. ఇక మరో మహిళా తహశీల్దార్ ఆరు నెలలే విధుల్లో ఉన్నప్పటికీ, ఉన్నతాధికారుల ఆదేశాలతో..! అత్యంత విలువైన ప్రభుత్వ భూమికి నాలా కన్వర్శన్ చేసిన విషయం నియోజకవర్గంలోనే హాట్ టాపిక్‌గా మారింది..మరోవైపు బాచుపల్లి తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే.. మండలంలో కూల్చివేతలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే విధంగా ఉన్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు.. దుండిగల్, కుత్బుల్లాపూర్ నూతన తహశీల్దార్‌లు, "జిపివో" లను నియమించి ప్రభుత్వ భూముల కబ్జాలను గుర్తించడంలో నిమగ్నమైనట్టు సమాచారం..
దుండిగల్, పెన్ పవర్, అక్టోబర్ 30:
నూతన తహశీల్దార్‌లు బాధ్యతలు, నియోజకవర్గం లోని 3 మండలాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ప్రతి మండలంలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు నూతన తహశీల్దార్‌లు, పారదర్శకతతో విధులు నిర్వర్తించ బోతున్నట్లు, బాచుపల్లి తహసీల్దార్ శ్రీమతి వాణిరెడ్డి, బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే నిరూపితమైందని స్థానికులు అభిప్రాయం తెలియజేశారు.. బాచుపల్లిలో గత మూడేళ్ళుగా, అడపాదడపా చర్యలతోనే మమాః అనిపించారని పలువురు ఆరోపించారు.. బాచుపల్లి తహశీల్దార్ ఆదేశాలతో గురువారం రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపును చేపట్టారు. ఆర్‌ఐలు భానుచందర్, మల్లేశ్వర్‌రావు, అండ్ జీపీవోల సమన్వయంతో బచుపల్లి మండల పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్ సర్వే నెంబర్లు 290, 292లో అక్రమంగా నిర్మించిన 4 గదులు, 6 బేస్‌మెంట్లు, ఒక కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారు.. నిజాంపేట్‌లోని సైదప్ప బస్తీలో సర్వే నెంబర్ 191లో అక్రమంగా నిర్మించిన 2 గదులను కూడా, రెవెన్యూ అధికారులు తొలగించారు.. ప్రభుత్వ భూములను కాపాడే దిశగా అధికారులు వేగంగా చర్యలు చేపట్టడం స్థానికుల్లో నమ్మకాన్ని కలిగించిందని పలువురు ప్రశంసించారు..
బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్ సర్వే నెంబర్ 290, 292, మరియు నిజాంపేట్ సర్వే నెంబర్ 191 ప్రభుత్వ భూముల ఆక్రమణతో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు అభినందనీని ఆకుల సతీష్ అన్నారు.. బాచుపల్లి ఎమ్మార్వో వాణిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతూ కూల్చివేతలు చేపట్టడం శుభసూచికమని తెలిపారు.. అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఆదేశించిన ఎమ్మార్వోకి మరియు రెవెన్యూ సిబ్బందికి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నందుకు ఆకుల సతీష్ ధన్యవాదాలు తెలిపారు.. భవిష్యత్తులోనూ ఇదేవిధంగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు..
About The Author
మాధవ్ పత్తి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
