జీహెచ్ఎంసిలో..! 27 "మున్సిపాలిటీలు" విలీనం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
జీహెచ్ఎంసీలో 27 సమీప మున్సిపాలిటీల విలీనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. విలీనం ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్లుగా వ్యవహరిస్తారని ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ (ఐఏఎస్) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.. ఉత్తర్వులు కూడా, తక్షణమే అమల్లోకి వచ్చినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు..

సమగ్ర పట్టణాభివృద్ధి, మెట్రోపాలిటన్ ప్లానింగ్ లక్ష్యంగా సర్కారు ఈ నిర్ణయం..
ఆయా మున్సిపల్ కమిషనర్‌లకు తాత్కాలిక డిప్యూటీ కమిషనర్‌లుగా బాధ్యతలు..
ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్లు సంబంధిత జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో విధులు..
ఈ విలీనం ప్రక్రియ ముగిసేవరకు తాత్కాలిక ఉప కమిషనర్‌లుగా కొనసాగుతారు..
ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, డిసెంబర్ 3:
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ విస్తరణలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోకి 27 మున్సిపాలిటీలను విలీనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లను తాత్కాలికంగా డిప్యూటీ కమిషనర్లుగా నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ (ఐఏఎస్) ఉత్తర్వులు జారీ చేశారు.. సమగ్ర పట్టణాభివృద్ధి, మెట్రోపాలిటన్ ప్రణాళిక, నియంత్రణా మరియు పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా అభివృద్ధి పరిచేందుకు.. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతాలు మరియు దాని చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలను(యుఎల్‌బి లు) జీహెచ్ఎంసీలో విలీనం చేశారు.. ఈ విలీనం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే వరకు మధ్యంతర చర్యల్లో భాగంగా, ఆయా మున్సిపాలిటీల కమిషనర్‌లే ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్ లుగా వ్యవహరించనున్నారని, వారు సంబంధిత జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో పనిచేస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.. అదిబట్ల, బండ్లగూడా జాగీర్, జల్పల్లి, మణికొండ, మీర్‌పేట్, నార్సింగి, పెద్దఅంబర్‌పేట్, షంషాబాద్, తుక్కుగూడ, తుర్కయాంజల్, బోడుప్పల్, దమ్మాయిగూడ, దుండిగల్, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, జవహర్‌నగర్, కొంపల్లి, మేడ్చల్, నాగరం, నిజాంపేట, పీర్జాదిగూడ, పోచారం, తూముకుంట, అమీన్‌పూర్, బొల్లారం, తెల్లాపూర్ వంటి మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లకు తాత్కాలిక డిప్యూటీ కమిషనర్‌లుగా బాధ్యతలు అప్పగించారు.. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఐఏఎస్ వెల్లడించారు..
About The Author
మాధవ్ పత్తి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
