వరి కోత మిషన్ తరలిస్తుండగా విద్యుత్ షాక్ గురై ఇద్దరి మృతి

వరి కోత మిషన్ తరలిస్తుండగా విద్యుత్ షాక్ గురై ఇద్దరి మృతి

జగ్గంపేట, పెన్ పవర్, నవంబర్ 9: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యమ్మపాలెం గ్రామం నుండి సింగరంపాలెం గ్రామానికి ఆదివారం ఉదయం వరి కోత మిషన్ ను ఐషర్ వ్యాన్ మీద తీసుకువెళుతుండగా విద్యుత్ షాక్ గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. జగ్గంపేట సిఐ వై ఆర్ కే శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం ఐషర్ వ్యాన్ పై వరి కోత మిషన్ తరలిస్తుండగా దారి మధ్యలో 11కెవి విద్యుత్ వైర్లు తగిలి డ్రైవర్ కు విద్యుత్ షాక్ కొట్టగా వెంటనే వ్యాన్ దిగి వ్యాన్ పట్టుకోగా కరెంటు పాసై మృతి చెందాడు. ముందు బండి మీద వెళుతున్న మిషన్ ఓనర్ వెనక్కి వచ్చి ఏమయిందోనని ఆందోళనతో వ్యాన్ ను ముట్టుకోగా కరెంటు పాసై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇద్దరిదీ పశ్చిమగోదావరి జిల్లా తణుకు గ్రామం. వరి కోత పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. డ్రైవర్ లెఫ్ట్ సైడ్ కు రావడంతో మిషన్ పైన గొట్టం విద్యుత్ వైర్లకు తగిలి కరెంటు పాస్ అయినట్లు తెలిపారు. మృతదేహాలను అంబులెన్స్ లో మార్చురీకి తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతి చెందినవారి వివరాలు ఓనర్ కారిపెట్టి సింహాద్రి అప్పన్న(57), డ్రైవర్ గడ్డం సందీప్(34).

Tags:

About The Author

Related Posts