మొంథా తుపాను సన్నద్ధంగా ఉన్న ప్రకాశం జిల్లా పోలీసులు — ఎస్పీ హర్షవర్ధన్ రాజు

prakasam-district-police-on-montha-cyclone-preparedness-—-sp-harshavardhan

 మొంథా తుపాను   సన్నద్ధంగా ఉన్న ప్రకాశం జిల్లా పోలీసులు — ఎస్పీ హర్షవర్ధన్ రాజు

  • తుపాను నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
  • ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్‌కు తక్షణ స్పందన” – స్పష్టమైన ఆదేశాలు
  • తీర ప్రాంత భద్రతపై పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల సమన్వయం
  • లోతట్టు ప్రాంత ప్రజల తరలింపుకు అవసరమైన సామగ్రి సిద్ధం

ప్రజల ప్రాణ భద్రతకే ప్రాధాన్యం – విపత్తు పరిస్థితుల్లో వేగవంతమైన చర్యలకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధం

0001 copy

 

ప్రకాశం జిల్లా మొత్తం మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ తెలిపారు. ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని, అన్ని విభాగాలతో సమన్వయంగా పనిచేయాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన ఎస్పీ, తుపాను సమయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై సమీక్ష నిర్వహించారు. కంట్రోల్ రూమ్ (Dial 100/112) 24 గంటలూ పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చే ప్రతి కాల్‌ను అత్యంత శ్రద్ధగా తీసుకుని తక్షణమే స్పందించాలని ఆదేశించారు. డ్రోన్ కెమెరాల ద్వారా వచ్చే లైవ్ ఫీడ్‌ను పరిశీలించి ప్రమాదకర ప్రాంతాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంత భద్రతకు సంబంధించి ఎస్పీ ప్రత్యేక సూచనలు చేశారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు సజావుగా సాగేలాగా చూడాలని ఆదేశించారు. లైఫ్ జాకెట్లు, రోపులు, కట్టర్లు, జెసిబీలు, క్రేన్‌లు, ట్రాక్టర్లు వంటి సాధనాలు ప్రతి సర్కిల్ పరిధిలో సిద్ధంగా ఉంచాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి హ్యాండ్ మైకులు, వాహనాల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. వాగులు, కాలువలు, నదులు ఉప్పొంగే ప్రమాదం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. చెట్లు, స్తంభాలు విరిగే అవకాశమున్న రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. “ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యం. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం” అని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఆయన వెంట ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

About The Author

Related Posts