"మొంథా తుఫాన్,, ప్రభావం: భద్రాచలం–సీలేరు బస్సులు రద్దు:జీకే వీధి ఎస్ఐ సురేష్
"మొంథా తుఫాన్,, ప్రభావం: భద్రాచలం–సీలేరు బస్సులు రద్దు
గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్27:‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మీదుగా భద్రాచలం మరియు సీలేరు వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గూడెం కొత్త వీధి ఎస్ఐ సురేష్ తెలిపారు.తుఫాన్ కారణంగా కొండచరియలు జారిపడే అవకాశం ఉన్నందున, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ మార్గంలో ప్రయాణాలు చేయవద్దని, రోడ్డు పరిస్థితులు సురక్షితంగా మారిన తరువాతే బస్సు సర్వీసులు పునరుద్ధరించబడతాయని ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.
