15వ తేది పాడేరులో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలి: వైసిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు వనపల రాజేష్
గూడెం కొత్త వీధి, పెన్‌పవర్, డిసెంబర్ 13:మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాడేరు జిల్లా కేంద్రంలో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని వైసిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు వనపల రాజేష్ పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో ఈ ర్యాలీ జరగనుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని మండల వైస్ ఎంపీపీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు,పార్టీ రాష్ట్ర–జిల్లా–నియోజకవర్గల నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కోరారు.మెడికల్ రంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని విమర్శించారు.ఆరోగ్యశ్రీ నిధులు సకాలంలో జమ చేయకపోవడంతో ఎంతోమంది నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరించటం వల్ల ఎంతోమంది వైద్య విద్యకు దూరమవుతున్నారని అన్నారు. కూటమి నాయకులు కళ్ళు తెరిచేలా భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని వైసిపి నాయకులు తప్పకుండా దాన్ని జయప్రదం చేయాలని కోరారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.
