డ్రగ్స్‌పై సమరం : భారత ప్రసాద్
డ్రగ్స్‌పై సమరం : భారత ప్రసాద్
హైదరాబాద్ పెన్ పవర్ నవంబర్ 28:
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు యువత నడుం బిగించాలని వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం చైర్మన్ భారత ప్రసాద్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రానున్న నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, మత్తు పదర్థాలను వాడొద్దని కోరుతూ వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే డ్రగ్స్, మత్తు పదర్థాలపై యువతను చైతన్యపరుస్తూ పోస్టర్ల ద్వారా ప్రచారాన్ని చేపడుతూ వారిలో అవగాహన కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన అన్నారు. పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, వైన్స్ షాపుల యజమానులు సైతం ఈ పోరాటానికి సహకరించాలని ఆయన కోరారు. నో డ్రగ్స్, నో ఆల్కాహాల్, నో డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో త్వరలోనే పోస్టర్లను రూపొందిస్తున్నామని తెలిపారు. యువతకు అవగాహన కల్పించే విషయంలో సంబంధిత ప్రభుత్వ అధికారులను కలిసి వారి ద్వారా కూడా చైతన్యం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాము చేపట్టనున్న ఈ సమరానికి ప్రతిఒక్కరూ సహకరించాలని భారత ప్రసాద్ కోరారు.

