ఆత్మవిశ్వాసం విజయానికి బాట – డిప్యూటీ తాహసిల్దార్ దుమంతి సత్యనారాయణ

ఆత్మవిశ్వాసం విజయానికి బాట – డిప్యూటీ తాహసిల్దార్ దుమంతి సత్యనారాయణ

Videoshot_20251206_112619  గూడెం కొత్త వీధి,పెన్ పవర్, డిసెంబర్5:తల్లిదండ్రులు లేని, పేదరికంతో బాధపడుతున్న నిరుపేద బాలికల విద్య కోసం ప్రభుత్వం స్థాపించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ఎంతో మందికి ఆశాకిరణాలుగా మారాయని డిప్యూటీ తాసిల్దార్ దుమంతి సత్యనారాయణ శుక్రవారం జరిగిన మెగా పిటిఎం 3.0 కార్యక్రమంలో అన్నారు. పాఠశాలలోని విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో మాట్లాడిన ఆయన, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు చూపవలసిన జాగ్రత్తలను వివరించారు. పిల్లలను అతిగా గారాబం చేయకుండా, ముఖ్యంగా సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని, అవసరం లేని కోరికలను తీర్చకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా ఇటీవల అంధుల ప్రపంచ క్రికెట్ వరల్డ్‌కప్‌లో దేశానికి కీర్తి తెచ్చిన పాంగి కరుణ విజయగాథను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వంట్లమామిడి గ్రామానికి చెందిన కరుణ చిన్నతనం నుంచే దృష్టి లోపంతో బాధపడినా, ఆపన్నహస్తంతో విశాఖపట్నంలోని అంధుల పాఠశాలలో చదువుకుంటూ క్రీడల్లో ప్రతిభ రుచి చూపిందని ఆయన తెలిపారు. సంపన్నమైన వారు కాకపోయినా, కడు పేదరికంలో పెరిగిన కరుణ అంధుల ప్రపంచకప్‌లో అద్భుత ప్రతిభ కనబరచి దేశానికి వరల్డ్‌కప్ రావడంలో కీలక పాత్ర పోషించిందని సత్యనారాయణ పేర్కొన్నారు."అందురాలైనా ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమే" అని ఆమె విజయాన్ని ఉదాహరణగా చూపిస్తూ విద్యార్థులను ప్రేరేపించారు. పిల్లలు బాగా చదివి జీవితంలో స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రి తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జీకే వీధి ఎస్సై సురేష్, తాసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ చిన్నబ్బాయి, పాఠశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.