వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 1: జగ్గంపేట నియోజకవర్గంలోని వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కాకినాడ లో డిఆర్ఓ జే వెంకట్రావుకు జగ్గంపేట వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. వైసిపి నాయకులు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పిలుపుమేరకు జగ్గంపేట వైసీపీ ఇన్చార్జ్ తోట నరసింహం ఆదేశాలతో గత నాలుగు రోజులపాటు విస్తృతంగా నిర్వహించిన సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వుయ్యూరి నాని, నకిరెడ్డి సుధాకర్, మండపాక రవికుమార్, వైసీపీ జగ్గంపేట అధ్యక్షుడు రావుల గణేష్ రాజా, కాపవరపు ప్రసాద్, కుండ్ల జాన్ వెస్లీ ఉన్నారు.