సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
By G ANIL KUMAR
On
జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 1: జగ్గంపేట ఆర్టీసీ బస్టాండ్ లో జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట ఎస్సై టి.రఘునాథరావు సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై విద్యార్థులు, ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వీడియోల రూపంలో సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ ధారణ పై ఆవశ్యకత, వివిధ క్రైమ్ అంశాలపై వివరించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై రఘునాథరావు సూచించారు.
Tags: