డీఎస్సీలో 19వ ర్యాంకు సాధించిన రామవరం వాసి
By G ANIL KUMAR
On
జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 27: డీఎస్సీ ఫలితాల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వీరంరెడ్డి సుజిని రాష్ట్రంలో 19వ ర్యాంకు సాధించారు. ఈమె ఎంఏ బీఈడీ పూర్తి చేసి డీఎస్సీకి ప్రిపేర్ అయ్యి విజయం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమెను టిడిపి తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడబాల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జనసేన నాయకులు మొగిలి గంగాధర్, మండపాక పాపారావు, సూర్యనారాయణ, సుబ్రహ్మణ్యం, మరుకుర్తి గంగాధర్, నీలం నాగులు మాగంటి నాని తదితరులు అభినందనలు తెలిపారు.
Tags: