మూడు కూల్చారు..! ఒకటి వదిలేశారు..!

వదిలేసిన "ఆ అక్రమ కట్టడమే"..! కబ్జాదారులకు "తొలిమెట్టు"..!

మూడు కూల్చారు..! ఒకటి వదిలేశారు..!

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పాటుపడాల్సిన రెవెన్యూ అధికారులు..! కబ్జాదారులకు కట్టబెట్టేందుకు, సూచనలు, సలహాలు ఇస్తూ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రశ్నించిన వారికి, "పిల్లి కళ్ళు మూసుకుని" పాలు త్రాగిన చందంగా కహానీలు వినిపిస్తున్నారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూములు పరాధీనం కావడానికి, రెవెన్యూ అధికారులే కీలకపాత్ర పోషించడం విశేషం.. మంగళవారం మండలంలోని బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో  రెవెన్యూ కూల్చివేతలు హాస్యాస్పదం.. రెవెన్యూ అధికారుల సమాధానం అద్భుతం..

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పాటుపడాల్సిన రెవెన్యూ అధికారులు..! కబ్జాదారులకు కట్టబెట్టేందుకు, సూచనలు, సలహాలు ఇస్తూ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రశ్నించిన వారికి, "పిల్లి కళ్ళు మూసుకుని" పాలు త్రాగిన చందంగా కహానీలు వినిపిస్తున్నారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూములు పరాధీనం కావడానికి, రెవెన్యూ అధికారులే కీలకపాత్ర పోషించడం విశేషం.. దుండిగల్‌ మండలంలో మంగళవారం రెవెన్యూ కూల్చివేతలు హాస్యాస్పదం..

ZomboDroid_03092025071922
బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ సర్వే నెం.550/8లో రెవెన్యూ కూల్చివేతలు..

 

దుండిగల్ రెవెన్యూ అధికారుల్లో మార్పు.. ఆశించడం అసంభవం..?

పాక్షిక చర్యలే లక్ష్యంగా విధులు..! ప్రభుత్వ భూములు పరాధీనం..!

 

బౌరంపేట్ సర్వే నెం.550/8 ప్రభుత్వ భూమిలో రెవెన్యూ హాస్యాస్పద చర్యలు..

 

ముగ్గురికి విక్రయించిన అసైన్డ్ భూమిలో ఎట్టకేలకు అక్రమ నిర్మాణాలు షురూ..

 

గత వారం మొదటి రూము కూల్చివేతలతో ఒప్పందం, కుదిరినట్టు సమాచారం..?

 

అందుకే వెంటనే మరో నాలుగు అక్రమ నిర్మాణాలు కట్టనిచ్చారా..?

 

ఫిర్యాదులు రాగానే మంగళవారం 3 నిర్మాణాలు కూల్చేసి..! ఒకటి వదిలేశారు..?

 

వదిలేసిన "ఆ అక్రమ కట్టడానికి" అధికారులకు ముట్టింది ఎంత..?

 

అదే ఇప్పుడు కబ్జాదారులకి తొలిమెట్టుగా..! రెవెన్యూ అధికారుల బహుమానం..?

 

ఒక్కో కూల్చివేతల్లో..! ఒక్కో అక్రమ కట్టడానికి మినహాయింపు..

 

ప్రభుత్వ భూముల పరిరక్షణ ఇదేనా కలెక్టర్ సాబ్.. కబ్జాలకు కట్టడిలేని మండలం..

 

ఈ వ్యవహారంతో " దుండిగల్‌ రెవెన్యూ అధికారుల చేతివాటం బట్టబయలు..

 

ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలపై..! పాక్షిక చర్యలే లక్ష్యంగా విధులు..

IMG_20250903_072654
550/8 ప్రభుత్వ భూమిలో..కబ్జాకు తొలిమెట్టుగా రెవెన్యూ బహుమతి..
IMG_20250903_072654
550/8 ప్రభుత్వ భూమిలో..కబ్జాకు తొలిమెట్టుగా రెవెన్యూ బహుమతి..

 

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, సెప్టెంబర్ 3:

 

కబ్జాదారులను ప్రోత్సహించడంలో దుండిగల్‌ రెవెన్యూ అధికారులు వారికి వారేసాటి..! ఇంత బహిరంగంగా సహకరిస్తే, ఉన్నతాధికారుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయనే‌ భయం కూడా లేకుండా పోయింది.. కొందరు జిల్లా స్థాయి అధికారుల అండతో తహశీల్దార్ కబ్జాదారులకి సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. సిఫార్సులే కావచ్చు, ప్రలోభాలకు తలొగ్గే కావచ్చు, మండలంలో ఎక్కడ చూసినా, రెవెన్యూ అధికారుల మొక్కుబడి కూల్చివేతలే దర్శనమిస్తాయి.. అందుకు అధికారులు కూడా బాధపడరు.. ఎందుకంటే తెలియక చేస్తేనే కదా బాధ..! ఇక్కడ కబ్జాదారులతో, అధికారుల ఒప్పందం కొత్తేమి కాదు..! ప్రస్తుతం బహుదూర్‌పల్లి, బౌరంపేట్, గాగిల్లాపూర్‌ ఈ‌ మూడు గ్రామాల పరిధిలోని, ప్రభుత్వ భూముల కబ్జాలపై రెవెన్యూ కూల్చివేతల తీరు..! అవినీతి అధికారుల చేతివాటాన్ని బట్టబయలు చేస్తోంది.. కొత్త అక్రమ కట్టడాలని పాతవిగా చిత్రీకరించి, సుమారు ‌3 ఎకరాల ప్రభుత్వ భూమిని, కబ్జాదారులకు పట్టం కట్టేందుకు సర్వం సిద్దం చేశారు.. ఈ వ్యవహారంలో అధికారులతో కబ్జాదారులు ఒప్పందపు, చర్చలు కూడా సఫలీకృతం అయినట్టు..? మంగళవారం నాటి రెవెన్యూ కూల్చివేతలతో తేటతెల్లమైంది.. 2025 ఆగష్టు 31న నిర్మించిన అక్రమ కట్టడానికి రంగులేసిన కబ్జాదారులు.. మూడేళ్ళ క్రితమే కట్టినట్లు చెబుతున్నారని, దుండిగల్‌ రెవెన్యూ అధికారులు "ఓ కహానీ వినిపించడం" పలు అనుమానాలను రేకెత్తిస్తుంది.. ఇంత బహిరంగంగా సహకరించే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు ఎలా కాపాడుతారో ఉన్నతాధికారులు తేల్చాలి.. ఇఒ విషయంలో జిల్లా కలెక్టర్ దృష్టి సారించకపోతే..! వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాదారులకు ధారాదత్తం చేసే ప్రమాదం ఉంది ..

#రెవెన్యూ అధికారుల ఉదాసీనతపై పాక్షిక చర్యలతో పతనమై పోతున్న భూములు.. ప్రత్యేక కథనంగా రేపటి సంచికలో పూర్తి ఆధారాలతో..#

IMG-20250828-WA0050
గాగిల్లాపూర్‌ భూధాన్ భూమిలో దుండిగల్‌ రెవెన్యూ అధికారుల ఉదాసీనతతో కూల్చేసిన షెడ్డు..

 

Tags:

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts