భారీ వర్షాలు నేపథ్యంలో దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్

768-512-24633173-thumbnail-16x9-heavy-rains-telangana  స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్02: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దసరా సెలవులు పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో విజయదశమి సెలవులపై విద్యార్థులు, పేరెంట్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పండుగ రోజైన అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఇచ్చి 3వ తేదీ నుంచే తిరిగి క్లాసులు మొదలవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఊర్లకు వెళ్లిన వారు పండుగ రోజు రాత్రికి రాత్రి ఎలా బయల్దేరి వస్తారని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్ 4 లేదా 5వ తేదీకి సెలవులు పొడిగించి అవసరమైతే రెండో శనివారం పని దినంగా ప్రకటించాలని సూచిస్తున్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.