గణపతి మండపాల వద్ద పోలీసు డ్రోన్ కెమెరాలతో నిఘా
By G ANIL KUMAR
On
జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 27: జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో గణపతి మండపాల వద్ద పోలీసు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినట్లు జగ్గంపేట సీఐ వై ఆర్ కే శ్రీనివాస్ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం జగ్గంపేటలో పలు గణపతి మండపాలను ఆయన సందర్శించి దర్శనం చేసుకున్నారు. ఆయా మండపాల వద్ద చుట్టుపక్కల ప్రాంతాలను డ్రోన్ కెమెరాతో పరిశీలించారు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో మూడు మండలాల్లో 493 గణపతి మండపాలకు అనుమతులు ఇచ్చామన్నారు. గణపతి మండపాల వద్ద కమిటీ సభ్యులు భద్రతా చర్యలు తీసుకోవాలని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. అలాగే గణపతి నిమజ్జనాలు చేసే పలు ప్రాంతాలను పరిశీలించినట్లు సీఐ వై ఆర్ కే తెలిపారు.
Tags: