గెద్దపేట గణనాధుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే నెహ్రూ

గెద్దపేట గణనాధుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే నెహ్రూ

జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 27: వినాయక చవితి సందర్బంగా గణేష్ ఉత్సవాల్లో భాగంగా జగ్గంపేట మండల గ్రామాల్లో వాడవాడల గణనాధుడి విగ్రహాలు నెలకొల్పారు. శుక్రవారం ఆయా గణనాధులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో పలు గణనాధులను దర్శించుకున్నారు. దీనిలో భాగంగా జగ్గంపేట గెద్దపేట గణనాధుడిని ఎమ్మెల్యే నెహ్రూ దర్శించుకుని పూజలు చేసి ప్రసాదం స్వీకరించారు. ముందుగా గెద్దపేట టైగర్స్ ఎమ్మెల్యే నెహ్రూకి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, కొండ్రోతు శ్రీను, కొండ్రోతు బుజ్జి, సాంబత్తుల చంద్రశేఖర్, బద్ది సురేష్, హరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts