చింతపల్లి ఏకలవ్య విద్యార్థుల క్రీడా ప్రతిభ రాష్ట్రస్థాయిలో కనబడింది

స్టాఫ్ రిపోర్టర్,పెన్ పవర్, చింతపల్లి,సెప్టెంబర్ 10:గుంటూరు నాగార్జున యూనివర్సిటీ వేదికగా జరిగిన నాల్గవ రాష్ట్రస్థాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ - 2025-26 లో చింతపల్లి ఏకలవ్య పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. పలు విభాగాల్లో పతకాలు సాధించి తమ స్కూల్ పేరు మరింత గౌరవపరచారు.

1IMG-20250910-WA0052  00 మీటర్ల పరుగులో ఇంటర్ సెకండియర్ చదువుతున్న మహేష్ గోల్డ్ మెడల్ సాధించగా, పదవ తరగతి విద్యార్థి బోయ మహేంద్ర సిల్వర్ మెడల్ అందుకున్నాడు. అదే విభాగంలో జావులెంత్రో బి. మహేంద్ర సిల్వర్, జానీ బాబు బ్రౌన్ మెడల్స్ సాధించడం విశేషం.400 మీటర్ల రిలే రన్నింగ్ విభాగంలో రవిబాబు, మహేంద్ర, ప్రవీణ్, స్టీఫెన్ ద్వితీయ బహుమతి పొందారు.కబడ్డీ విభాగంలో ఎస్. చరణ్, కె. దుర్గాప్రసాద్ నేషనల్ స్థాయికి ఎంపికై, వచ్చే నెలలో ఒరిస్సాలో జరగనున్న ఏకలవ్య నేషనల్ మీట్ లో పాల్గొననున్నారు.వాలీబాల్ విభాగంలో చిన్నారావు, జానీ బాబు,ఫుట్‌బాల్ లో కార్తీక్, పి. పవన్ కుమార్,కోకోలో పలు విద్యార్థులు నేషనల్ ఎంపికలో అర్హత సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, "విద్యార్థులు క్రీడల ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నేషనల్ స్ధాయిలో అందే సర్టిఫికెట్లు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల మీద ఎంతో ప్రభావం చూపుతాయి" అని తెలిపారు.పీ.ఈ.టి. అరుణ్ కుమార్ సింగ్ శిక్షణలో ఇన్ని మంది విద్యార్థులు నేషనల్‌కు ఎంపిక కావడం ఆంధ్రప్రదేశ్‌లోని ఏకలవ్య పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.ఈ క్రీడా వేడుకలో హిందీ ఉపాధ్యాయులు బద్రి ప్రసాద్, తెలుగు ఉపాధ్యాయుడు ఎం. లోవరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులందరికీ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Related Posts