ములగాడలో వినాయక ఏకాదశి మహోత్స వాలకు
కోరమండల్ యాజమాన్యం ప్రత్యేక శోభ
జీవీఎంసీ పరిధి 58 వ వార్డు ములగాడ గ్రామం లో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ వరసిద్ధి వినాయక ఏకాదశి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మహోత్స వాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యం ప్రత్యేకంగా పాల్గొని మహోత్స వాలకు మరింత శోభను చేకూర్చింది.యూనిట్ హెడ్ సి.హెచ్. శ్రీనివాసరావు, హెచ్.ఆర్. హెడ్ కె.వి.వి.వై.ఎస్. నారాయణ, జి.ఎం.ఆర్. శ్రీనివా సరావు స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుడి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా కోరమం డల్ యాజమాన్యం గ్రామ ప్రజలు, యువత శ్రద్ధతో చేసిన వినాయకుని అలంకరణను అభి నందించారు.
ఈ కార్యక్రమంలో జాషువా ఎస్సీ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, సభ్యు లు, పొదుపు సంఘం మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
About The Author

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.