మిగులు రైతులను గుర్తించాలన్న జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశం

పద్మనాభం మండల కాంప్లెక్స్ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యవసాయ అధికారి కే. అప్పలస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, మండల పరిధిలో తప్పుగా నమోదైన ఆధార్ నంబర్లు 342, మరణించిన రైతుల సంఖ్య 209గా గుర్తించినట్లు తెలిపారు.ఈ తప్పులను సరిచేసి, ఆధార్ సీడింగ్ ప్రక్రియను తప్పక పరిశీలించాలని ఆయన సూచించారు. మరణిం చిన రైతుల కుటుంబ సభ్యులు మ్యూటేషన్ చేయించుకోవడం ద్వారా తదుపరి పథకాల ప్రయోజనాలు పొందేలా చూడాలని తెలిపారు.
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులకు త్వరలోనే నిధులు వారి ఖాతాల్లో జమ కానున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం. వెంకటాచలంIMG-20250822-WA0001 ఆధ్వర్యంలో విలేజ్ రెవెన్యూ అధికారులు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.పెండింగ్ లిస్టులో ఉన్న రైతుల వివరాలను ఆయా గ్రామాల్లో వారికి తెలియజేసి, అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు.

Tags:

About The Author

SOMA RAJU Picture

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts