పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల
By G ANIL KUMAR
On
జగ్గంపేట, పెన్జ పవర్, జూలై 25: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుండి ఏలేరుకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, పిఠాపురం జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరై మోటార్ స్విచ్ ఆన్ చేసి, గోదావరి జలాలకు పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగినదని రైతాంగానికి సాగునీరు అందించడానికి ఎప్పుడూ ముందుంటామన్నారు.
Tags: