ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

జగ్గంపేట, పెన్ పవర్, జూలై 27: జగ్గంపేట కాపు కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సొసైటీ చైర్మన్ పదవీ స్వీకారోత్సవ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గంపేట నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారని జ్యోతుల నెహ్రూను కొందరు ప్రశ్నిస్తున్నారని వారికి ఇదే నా సమాధానమన్నారు. 2004లో ఏవిధంగా రాజకీయ స్ట్రాటజీ ఉపయోగించారో దాన్ని వాళ్లు ఇప్పుడు ఉపయోగిస్తున్నారన్నారు. అప్పుడు తోట నరసింహంకు టికెట్ ఇచ్చినప్పుడు వెంకటాచలం మాదిరి కనిపించడానికి మీసం గీయించేశారని అది జగ్గంపేట ప్రజలను మోసం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు. సూర్యనారాయణమ్మ అనే మహిళ బాధ్యత తీసుకుంటానని చెప్పి మాట తప్పారన్నారు. వీరవరం సొసైటీకి పోటీ వద్దని తోట వెంకటాచలం కోరితే అక్కడి నుంచి నెహ్రూ పోటీకి ఎవరినీ దింపలేదని అది అప్పుడు ఉన్న నాయకులకు మాత్రమే తెలుసునన్నారు. శత్రు వుకు అన్యాయం చేయని వ్యక్తి జ్యోతుల నెహ్రూ అని అది జగమెరిగిన సత్యమన్నారు. ఏరోజు తాను నోరు విప్పలేదని వారు మాట్లాడిన తీరుకు ఇప్పుడు సమాధానం చెబుతున్నానని అవి వాస్తవాలు కాదా అని నవీన్ ప్రశ్నించారు.

Tags:

About The Author

Advertisement

LatestNews

ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి
దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,