ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
By G ANIL KUMAR
On
జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 1: ఈనెల మూడవ తేదీన జగ్గంపేట ప్రభుత్వ హైస్కూల్లో జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు జరగనున్నట్లు జూడో జిమ్ అండ్ కరాటే మాస్టర్ టీవీవి రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011, 2012, 2013 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ పోటీకి అర్హులు అన్నారు. పోటీలకు హాజరయ్యే అభ్యర్థులు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రావాలన్నారు.
వెయిట్ కేటగిరీ
అబ్బాయిలు : -30-35-40-45-50-55-60-66+66
అమ్మాయిలు
-28-32-36-40-44-48-52-57+57.
పోటీలో మొదటి స్థానం సాధించిన వాళ్లు గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవుతారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 9, 10వ తేదీల్లో జరుగుతాయన్నారు.
Tags: