జగ్గంపేటలో బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా వేడుకలు
By G ANIL KUMAR
On
జగ్గంపేట, పెన్ పవర్, ఆగస్టు 12 : ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం జగ్గంపేటలో బిజెపి కాకినాడ జిల్లా కార్యదర్శి, జగ్గంపేట ఇంచార్జ్ దాట్ల కృష్ణ వర్మ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వై ఆర్ కే శ్రీనివాస్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గంపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. బిజెపి ఇన్చార్జి కృష్ణ వర్మ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలంతా దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, బిజెపి మండల అధ్యక్షుడు పల్లా రాము, కోన సురేష్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: