గూడెం కొత్తవీధి,పెన్ పవర్,సెప్టెంబర్ 1:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి ఎంపీడీవో వై. ఉమా మహేశ్వర రావు ఆదివారం సాయంత్రం తన పదవీ విరమణ వలన విధుల నుండి విడుదలయ్యారు.దీంతో జిల్లా ప్రజా పరిషత్, విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు కార్యాలయ పరిపాలనాధికారి ఇమ్మానుయేలు సోమవారం ఉదయం నుంచి ఎంపీడీవోగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.ఇమ్మానుయేలు ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎంపీపీ బోయిన కుమారి, స్థానిక సర్పంచ్ సుభద్ర, గాలికొండ సర్పంచ్ బుజ్జిబాబు, కో ఆప్షన్ సభ్యులు దావూద్, వైసిపి నాయకులు అరుణ్ కుమార్, కృప, బాబి, బోయిన వెంకట్ తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దుస్సాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కొత్త ఎంపీడీవోకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.