స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,చింతపల్లి/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు19: అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలంలోని మార్కెట్ యార్డ్ హాల్ నందు లో ఏర్పాటుచేసిన అల్లూరి సీతారామరాజు జిల్లా జాప్ యూనియన్ జిల్లా కమిటీ ఎన్నిక ను (ఎన్.యు.జె.ఐ) నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా సంస్థ కు అనుబంధంగా (జె.ఏ.ఏ) జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా జాప్ యూనియన్ ఎన్నిక ను జాప్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు సత్యనారాయణ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జే.వి.ఆర్ గోపాల్ వర్మ,అనకాపల్లి అధ్యక్షులు దాడి వెంకటరావు,మరియు నర్సీపట్నం ఇంచార్జ్ వీరబాబు వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అల్లూరి జిల్లా జాప్ యూనియన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.అల్లూరి జిల్లా అధ్యక్షులుగా పనసల చిట్టిబాబు,జిల్లా కార్యదర్శిగా సాగిన లక్ష్మణరావు,కోశాధికారి కదుల శ్రీనువాష్,జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా గబులంగి హనుమంత రావులను నియమించారు.చింతపల్లి,జి.కె.వీధి,కొయ్యూరు మండలాల సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగిందనీ అల్లూరి జిల్లా జాఫ్ అధ్యక్షుడు పనసల చిట్టి బాబు తెలియజేశారు.